News April 23, 2025
సుల్తానాబాద్: లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎస్సారెస్పీ అధికారులు

సుల్తానాబాద్‌లోని ఎస్సారెస్పీ డివిజన్ -6 కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేసే యాజాజ్ సిక్ లీవ్‌కి సంబంధించిన జీతం చెల్లించేందుకు సూపరింటెండెంట్ శ్రీధర్ బాబు, సీనియర్ అసిస్టెంట్ సురేశ్ రూ.20వేలు లంచం డిమాండ్ చేశారు. SRSP అధికారులు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు బుధవారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి నేతృత్వంలో జరిగిన ఆపరేషన్లో నగదును స్వాధీనం చేసుకున్నారు.
Similar News
News April 24, 2025
VZM: ఇంటర్ విద్యా శాఖాదికారిగా శివ్వాల తవిటి నాయుడు

జిల్లా ఇంటర్ విద్యా శాఖాదికారిగా శివ్వాల తవిటి నాయుడు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆయన శ్రీకాకుళంలో RIOగా DOEOగా, మన్యం జిల్లా ప్రత్యేక అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తూ పదోన్నతిపై ఇక్కడ నియమితులయ్యారు. ఇంటర్ విద్యలో RIO, DOEO పోస్టులను కలిపి జిల్లా ఇంటర్ విద్యా శాఖాధికారి పోస్టును ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉత్తర్వుల జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆయన బాధ్యతలు చేపట్టారు.
News April 24, 2025
ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత సీట్లు.. 28 నుంచి దరఖాస్తులు

AP: అన్ని ప్రైవేట్ స్కూళ్లలో పేదల పిల్లలకు 2025-26 విద్యాసంవత్సరంలో 25% ఉచిత ప్రవేశాలకు షెడ్యూల్ వెలువడింది. ఫస్ట్ క్లాస్‌లో సీట్ల కోసం ఈ నెల 28 నుంచి మే 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. చిరునామా ధ్రువీకరణకు పేరెంట్స్ ఆధార్ కార్డ్/ ఓటరు కార్డు/ రేషన్ కార్డు/డ్రైవింగ్ లైసెన్స్/ విద్యుత్ బిల్లు అవసరం. విద్యార్థుల వయసు 01.06.2025 నాటికి ఐదేళ్లు నిండి ఉండాలి.
వెబ్‌సైట్: https://cse.ap.gov.in/
News April 24, 2025
మూడు ఉద్యోగాలు సాధించిన భూషణరావుపేట యువకుడు

కథలాపూర్ మండలం భూషణరావుపేట గ్రామానికి చెందిన ఉషకోల అనిల్ కుమార్ అనే యువకుడు మూడు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. 6 నెలల క్రితం జరిగిన వార్డ్ ఆఫీసర్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పోస్టుల పరీక్ష రాసి ఉద్యోగం సాధించారు. కానీ వాటిలో చేరలేదు. ఇటీవల ఆర్అండ్‌బీ ఏఈ పరీక్ష ఫలితాల్లో ప్రతిభ చాటి ఏఈగా ఎంపికయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల ఏఈగా బుధవారం బాధ్యతలు తీసుకున్నారు.