News April 23, 2025
విద్యార్థులకు మల్కాజిగిరి DCP కీలక సూచన

పరీక్షల్లో తప్పితే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడొద్దని మల్కాజిగిరి DCP పద్మజా రెడ్డి హితవు పలికారు. ‘చదువు ఒక్కటే జీవితం కాదు. ఒక భాగ మాత్రమే. లైఫ్‌లో గెలుపోటములు సహజం. పరీక్షల్లో ఫెయిల్, తక్కువ మార్కులు వచ్చాయని బాధపడకుండా మళ్లీ ప్రయత్నించండి. పిల్లల భవిష్యత్తు కోసమే తల్లితండ్రులు కష్టపడుతున్నారు. విద్యార్థులు పట్టుదలతో ముందుకువెళ్లాలి’ అని DCP పద్మజా రెడ్డి మోటివేట్ చేశారు.
Similar News
News April 24, 2025
ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత సీట్లు.. 28 నుంచి దరఖాస్తులు

AP: అన్ని ప్రైవేట్ స్కూళ్లలో పేదల పిల్లలకు 2025-26 విద్యాసంవత్సరంలో 25% ఉచిత ప్రవేశాలకు షెడ్యూల్ వెలువడింది. ఫస్ట్ క్లాస్‌లో సీట్ల కోసం ఈ నెల 28 నుంచి మే 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. చిరునామా ధ్రువీకరణకు పేరెంట్స్ ఆధార్ కార్డ్/ ఓటరు కార్డు/ రేషన్ కార్డు/డ్రైవింగ్ లైసెన్స్/ విద్యుత్ బిల్లు అవసరం. విద్యార్థుల వయసు 01.06.2025 నాటికి ఐదేళ్లు నిండి ఉండాలి.
వెబ్‌సైట్: https://cse.ap.gov.in/
News April 24, 2025
మూడు ఉద్యోగాలు సాధించిన భూషణరావుపేట యువకుడు

కథలాపూర్ మండలం భూషణరావుపేట గ్రామానికి చెందిన ఉషకోల అనిల్ కుమార్ అనే యువకుడు మూడు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. 6 నెలల క్రితం జరిగిన వార్డ్ ఆఫీసర్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పోస్టుల పరీక్ష రాసి ఉద్యోగం సాధించారు. కానీ వాటిలో చేరలేదు. ఇటీవల ఆర్అండ్‌బీ ఏఈ పరీక్ష ఫలితాల్లో ప్రతిభ చాటి ఏఈగా ఎంపికయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల ఏఈగా బుధవారం బాధ్యతలు తీసుకున్నారు.
News April 24, 2025
సర్జికల్ స్ట్రైక్స్ వార్తలు.. పాక్ సరిహద్దు గ్రామాలు ఖాళీ?

J&K పహల్‌గామ్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేస్తుందనే వార్తలు వస్తున్నాయి. దీంతో పాకిస్థాన్‌లో గుబులు మొదలైంది. ISI హెచ్చరికలతో ముందుజాగ్రత్తగా సరిహద్దు గ్రామాలను ఆర్మీ ఖాళీ చేయిస్తున్నట్లు సమాచారం. ఎయిర్‌ఫోర్స్ కూడా అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. ఉరి దాడికి కౌంటర్‌గా 2016లో POK, పుల్వామా దాడికి ప్రతీకారంగా 2019లో బాలాకోట్‌పై భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేసిన విషయం తెలిసిందే.