News April 23, 2025
కామారెడ్డి: నెలవారీ నేర సమీక్ష

కామారెడ్డి జిల్లా SP రాజేశ్ చంద్ర జిల్లా పోలీస్ అధికారులతో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. SP మాట్లాడుతూ.. పెండింగ్ (అండర్ ఇన్వెస్టిగేషన్)లో ఉన్న కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు పరిమితికి లోబడి ఉండాలని, గ్రేవ్ కేసులలో ఇన్వెస్టిగేషన్ విషయంలో SOP కూడళ్లలో, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
Similar News
News April 16, 2026
వనపర్తి: ప్రేమ పేరుతో మోసం.. యువకుడిపై కేసు

పెబ్బేరులో ప్రేమ, పెళ్లి పేరుతో మహిళను మోసం చేసిన జుర్రు మహేశ్‌పై కేసు నమోదు అయింది. ఓ యువతిని ప్రేమిస్తున్నానని నమ్మించి పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి 2021సంవత్సరం నుంచి ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఇప్పుడు మరో యువతిని పెళ్లి చేసుకొని మోసం చేశాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతనిపై పెబ్బేరు పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు.
News April 16, 2026
నేడు రాజ్యసభ సభ్యుడిగా వేం నరేందర్ రెడ్డి ప్రమాణం

MHBD జిల్లా కేసముద్రం మండలం అర్పనపల్లికి చెందిన వేం నరేందర్ రెడ్డి గురువారం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. TG నుంచి జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన ఆయన ప్రమాణ కార్యక్రమానికి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు ఢిల్లీకి బయలుదేరారు. సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడైన నరేందర్ రెడ్డి ఎన్నికపై కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తూ, జిల్లా అభివృద్ధికి కృషి చేస్తారని ఆశిస్తున్నారు.
News April 16, 2026
చల్వాయిలో పరకాల వాసి సుపారీ హత్య..?

ములుగు జిల్లా చల్వాయి శివారులో పరకాలకు చెందిన ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అతడి భార్యే సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు తెలుస్తోంది. సుమన్ అనే వ్యక్తి తప్పిపోయినట్లు HNK (D) పరకాల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. విచారణ జరిపిన పోలీసులు మార్చి 3న చల్వాయి వద్ద హత్య చేసిన తర్వాత పెట్రోల్ పోసి కాల్చివేసినట్లు గుర్తించినట్టు సమాచారం. పస్రా, పరకాల పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించి ఆధారాలు సేకరించారు.


