News April 23, 2025

మద్యం కుంభకోణంలో మరో నిందితుడు అరెస్ట్

image

AP: మద్యం కుంభకోణం వ్యవహారంలో పోలీసులు మరో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఈ స్కామ్‌కు సంబంధించి రాజ్ కసిరెడ్డి అరెస్ట్ కాగా, తాజాగా A8 చాణక్యను అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన అతడిని హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి ఏపీకి తరలిస్తున్నట్లు సమాచారం. మరోవైపు, రాజ్ కసిరెడ్డి విచారణలో పూర్తి వివరాలు వెల్లడించలేదని సిట్ అధికారులు కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Similar News

News April 24, 2025

ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత సీట్లు.. 28 నుంచి దరఖాస్తులు

image

AP: అన్ని ప్రైవేట్ స్కూళ్లలో పేదల పిల్లలకు 2025-26 విద్యాసంవత్సరంలో 25% ఉచిత ప్రవేశాలకు షెడ్యూల్ వెలువడింది. ఫస్ట్ క్లాస్‌లో సీట్ల కోసం ఈ నెల 28 నుంచి మే 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. చిరునామా ధ్రువీకరణకు పేరెంట్స్ ఆధార్ కార్డ్/ ఓటరు కార్డు/ రేషన్ కార్డు/డ్రైవింగ్ లైసెన్స్/ విద్యుత్ బిల్లు అవసరం. విద్యార్థుల వయసు 01.06.2025 నాటికి ఐదేళ్లు నిండి ఉండాలి.
వెబ్‌సైట్: https://cse.ap.gov.in/

News April 24, 2025

సర్జికల్ స్ట్రైక్స్ వార్తలు.. పాక్ సరిహద్దు గ్రామాలు ఖాళీ?

image

J&K పహల్‌గామ్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేస్తుందనే వార్తలు వస్తున్నాయి. దీంతో పాకిస్థాన్‌లో గుబులు మొదలైంది. ISI హెచ్చరికలతో ముందుజాగ్రత్తగా సరిహద్దు గ్రామాలను ఆర్మీ ఖాళీ చేయిస్తున్నట్లు సమాచారం. ఎయిర్‌ఫోర్స్ కూడా అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. ఉరి దాడికి కౌంటర్‌గా 2016లో POK, పుల్వామా దాడికి ప్రతీకారంగా 2019లో బాలాకోట్‌పై భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేసిన విషయం తెలిసిందే.

News April 24, 2025

సింగరేణి.. వారికి 50% జీతంతో స్పెషల్ లీవ్స్

image

TG: తీవ్ర కాలేయ వ్యాధి(లివర్ సిరోసిస్) బారిన పడిన కార్మికులకు ఊరట కలిగించే నిర్ణయాన్ని సింగరేణి యాజమాన్యం ప్రకటించింది. 50 శాతం వేతనంతో కూడి ప్రత్యేక సెలవులు మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. వారు కోలుకునే వరకు ఈ వెసులుబాటు ఉంటుందని తెలిపింది. ఇప్పటి వరకు గుండె జబ్బు, టీబీ, క్యాన్సర్, కుష్టు, పక్షవాతం, ఎయిడ్స్, మూత్రకోశ, మెదడు వ్యాధులకు ఇలాంటి సదుపాయం ఉండగా కాలేయ వ్యాధులకూ విస్తరించారు.

error: Content is protected !!