News April 23, 2025

అల్లూరి: ‘ఆ ఐదు స్కూళ్లలో ఒక్కరూ పాస్ కాలేదు’

image

అల్లూరి జిల్లాలో పదోతరగతి ఫలితాలు నిరాశ పరిచాయి. ఆశ్రమ పాఠశాలలు జెర్రిల, ధారకొండ, అప్పర్ సీలేరు, KGBV డుంబ్రిగూడ, ప్రాజెక్టు హై స్కూల్లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదని DEO బ్రహ్మాజీ రావు తెలిపారు. రాజవొమ్మంగి ఏపీ గురుకుల పాఠశాల, లాగరాయి జడ్పీ ఉన్నత పాఠశాల, అరకువ్యాలీ పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయని వెల్లడించారు.

Similar News

News April 18, 2026

ఇందిరమ్మ ఇళ్లుగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు..!

image

TG అర్బన్‌లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల రెండో దశలో సొంత స్థలం లేని వారిని L2 జాబితాలో తీసుకొని వారికి 2BHK ఇళ్లు ఏ స్థితిలో ఉంటే అలాగే అప్పగించాలని GOVT నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నతాధికారి Way2Newsకు తెలిపారు. మిగిలిన పనులను లబ్ధిదారులే పూర్తి చేసుకుంటే వారికి బిల్లులు మంజూరు చేస్తారు. వీటి కోసం లబ్ధిదారుల కమిటీ ఏర్పాటు చేస్తారు. దీనికి MBNR జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయనున్నట్లు సమాచారం.

News April 18, 2026

RRR, గ్రీన్‌ఫీల్డ్ హైవేలు నగర కనెక్టివిటీని మార్చివేస్తాయి : కోమటిరెడ్డి

image

తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని, హైదరాబాద్ దేశంలోనే అత్యంత ఆకర్షణీయ పెట్టుబడి కేంద్రంగా మారిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఓ ప్రాపర్టీ షోలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కోసం 40,000 కోట్లు కేటాయించామని, 70,000 కోట్ల విలువైన రహదారి ప్రాజెక్టులు అమలులో ఉన్నాయని వెల్లడించారు. RRR, గ్రీన్‌ఫీల్డ్ హైవేలు నగర కనెక్టివిటీని మార్చివేస్తాయని పేర్కొన్నారు.