News April 23, 2025

వీరయ్య చౌదరి హత్యపై రెండు జిల్లాల పోలీసుల చర్చలు

image

TDP అధికార ప్రతినిధి, మాజీ MPP వీరయ్య చౌదరి హత్య విచారణకు సంబంధించి, తీసుకోవలసిన చర్యలపై బాపట్ల SP తుషార్ డూడి, ప్రకాశం SP దామోదర్ ఇరువురు చర్చించుకున్నారు. CM చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పక్క పక్కనే ఉన్న రెండు జిల్లాల ఎస్పీలు హత్య విచారణకు సంబంధించిన విషయాలు చర్చించుకోవడంతో హంతకులను త్వరలోనే అరెస్టు చేయటానికి పోలీస్ శాఖ సిద్ధమైనట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు.

Similar News

News January 17, 2026

భూగర్భంలో JBS- శామీర్‌పేట మెట్రో..!

image

హైదరాబాద్ మెట్రో ఫేజ్- 2లో భాగంగా జేబీఎస్(JBS) నుంచి శామీర్‌పేట వరకు రాజీవ్ రహదారి మీదుగా సుమారు 17 కిలోమీటర్ల కొత్త మెట్రో లైన్ నిర్మిస్తున్నారు. ఇది ఉత్తర హైదరాబాద్ ప్రయాణాన్ని సులభతరం చేసే కీలక ప్రాజెక్ట్. ఈ దారిలో ఉన్న హకీంపేట ఎయిర్ బేస్ రక్షణపరంగా అత్యంత సున్నితమైన ప్రాంతం కావడంతో ఆర్మీ నిబంధనల ప్రకారం అక్కడ మెట్రోను పిల్లర్లపై కాకుండా భూగర్భంలో (<<18874590>>Underground<<>>) నిర్మించాల్సి వస్తోంది.

News January 17, 2026

KMR: ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

image

కామారెడ్డి జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో చేరడానికి విద్యార్థులు ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి రాజు తెలిపారు. ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 28వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆయన తెలిపారు. 6 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఏప్రిల్ 19న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు. www.telanganams.cgg.gov.in ను సందర్శించాలన్నారు.

News January 17, 2026

C-DAC 60 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

image

బెంగళూరులోని <>C-DAC<<>> 60 ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల వారు నేటి నుంచి జనవరి 31 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో BE/BTech, ME/MTech, PG, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాతపరీక్ష/స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://cdac.in