News April 24, 2025
SRH ఘోర ఓటమి

IPLలో SRH ఓటముల పరంపర కొనసాగుతోంది. ఇవాళ ఉప్పల్‌లో ముంబైతో జరిగిన మ్యాచులో 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. 144 పరుగుల టార్గెట్‌ను ముంబై 15.4 ఓవర్లలోనే ఛేదించింది. రోహిత్ శర్మ 70 రన్స్‌తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. సూర్య 40*, జాక్స్ 22 రన్స్ చేశారు. ఈ ఓటమితో SRH ప్లే ఆఫ్స్ ఆశలు దాదాపు గల్లంతు కాగా ముంబైకి ఇది వరుసగా నాలుగో విజయం.
Similar News
News April 25, 2025
యుద్ధ భయం.. ఒడిదొడుకుల్లో భారత మార్కెట్లు

భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల వేళ ఇవాళ స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. యుద్ధ భయం నేపథ్యంలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ తొలుత గ్రీన్‌లోనే మొదలైనా క్రమంగా రెడ్‌లోకి పడిపోయాయి. ప్రస్తుతం బీఎస్ఈ 60 పాయింట్లు నష్టపోయి 79,742 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 24 పాయింట్లు కోల్పోయి 24,213 వద్ద కొనసాగుతోంది.
News April 25, 2025
ఉగ్రదాడి: ఆలస్యమే వారిని రక్షించింది!

పహల్గామ్ ఉగ్రదాడిలో మరో ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రయాణం ఆలస్యం కావడంతో 39 మంది ప్రాణాలతో బయటపడ్డారు. గుర్రాలు అందుబాటులో లేక 28 మంది, ఓ రెస్టారెంట్‌లో ఫుడ్‌లో ఉప్పు ఎక్కువైందని కేరళ ఫ్యామిలీ ఆగిపోయింది. అదే సమయంలో ఉగ్ర దాడులు చోటు చేసుకోగా అనుకోని ఆలస్యం వీరిని మృత్యువు నుంచి తప్పించింది. మరోవైపు దాడి జరిగిన టైమ్‌లో భేల్‌పూరి తినేందుకు స్నాక్ బ్రేక్ తీసుకున్న ఓ జంట ప్రాణాలతో బయటపడింది.
News April 25, 2025
సంజూ లేని లోటు మాకు కనిపిస్తోంది: సందీప్

కెప్టెన్ సంజూ శాంసన్ లేని లోటు తమ జట్టుకు తెలుస్తోందని రాజస్థాన్ రాయల్స్ బౌలర్ సందీప్ శర్మ అన్నారు. ‘సంజూ చాలా అనుభవజ్ఞుడైన బ్యాటర్, కెప్టెన్. మా లైనప్‌లో తను లేని లోటు కనిపిస్తోంది. అతడి గాయం మాకు చాలా నష్టం చేసింది’ అని పేర్కొన్నారు. తొలి 3 మ్యాచులు బ్యాటర్‌గా ఆడిన సంజూ, ఆ తర్వాత పక్కటెముకల గాయంతో జట్టుకు దూరమయ్యారు. ఆ తర్వాత వరుసగా 3 మ్యాచుల్లో గెలవాల్సిన స్థితి నుంచి RR ఓటమిపాలైంది.