News April 24, 2025
బాపట్ల: రూ.25 లక్షలతో కొళాయిలు- కలెక్టర్

బాపట్ల జిల్లా చినగంజాం మండలంలోని చిన్న కొత్త గొల్లపాలెంలో జల జీవన్ మిషన్ కింద రూ.25 లక్షలతో కొళాయి కనెక్షన్లు ఇస్తున్నట్లు కలెక్టర్ వెంకట మురళి బుధవారం తెలిపారు. సీఎం పర్యటనలో భాగంగా ఇచ్చిన హామీల అమలుపై జిల్లా అధికారులతో బుధవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రతి ఇంటికి తాగునీరు అందించడానికి జల జీవన్ మిషన్ కింద పనులు మంజూరు చేసినట్లు కలెక్టర్ చెప్పారు.
Similar News
News April 25, 2025
MHBD: బైకుపై వెళ్తుండగానే గుండెపోటు.. వ్యక్తి మృతి

గుండెపోటుతో వ్యక్తి మరణించిన ఘటన <<16198792>>WGL జిల్లాలో<<>> నిన్న జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. MHBD జిల్లా నెల్లికుదురు మండలం మేజరాజుపల్లికి చెందిన యాకయ్య(45) KNR జిల్లాలోని ఓ క్వారీలో పని చేస్తున్నాడు. బాబాయి బిడ్డ పెళ్లికోసం స్వగ్రామానికి వచ్చి తిరిగి KNR బయల్దేరాడు. పర్వతగిరి మండలానికి చెందిన ఓ వ్యక్తి లిఫ్ట్ అడగ్గా.. అతడినే బైక్ నడపమని వెనక కూర్చున్నాడు. గవిచర్లకు చేరుకోగానే గుండెపోటుతో మరణించాడు.
News April 25, 2025
మోపిదేవి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

కృష్ణా జిల్లా మోపిదేవి వద్ద గురువారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. స్థానికుల కథనం మేరకు.. అవనిగడ్డకు చెందిన యాసాబాల భాస్కర్ (21), బంతుల సుధాకర్ (18) చల్లపల్లి వెళ్తుండగా లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.
News April 25, 2025
ఎన్టీఆర్: పోక్సో కేసులో అరెస్ట్ అయిన వ్యక్తికి.. 3ఏళ్ల కఠిన కారాగార శిక్ష

మైనర్ బాలికలతో అసభ్యంగా ప్రవర్తించిన డేవిడ్ పవన్ కుమార్(37) అనే వ్యక్తిపై కృష్ణలంక పోలీసులు పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసును విజయవాడ పోస్కో కోర్ట్ జడ్జి వి.భవాని గురువారం విచారించారు. డేవిడ్ పవన్ కుమార్ నేరం చేసినట్లు రుజువైనందున నిందితుడికి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.20వేల జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు.