News April 24, 2025
RCPM: ఈ నెల 26,27 తేదీలలో జాబ్ మేళా

రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో ఈ నెల 26,27 తేదీలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మంత్రి వాసంశెట్టి సుభాష్ కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. పట్టణంలోని ఉపాధి ఆఫీస్ నందు ఈ జాబ్ మేళా జరుగుతుందని తెలిపారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ అర్హత గల 18 నుంచి 35సంవత్సరాల వయసు గల అభ్యర్థులు హాజరుకావొచ్చని తెలిపారు. పరిసర ప్రాంతాల నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొవాలన్నారు.
Similar News
News January 8, 2026
వరంగల్ అభివృద్ధిపై బల్దియా ఆఫీసులో రివ్యూ

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్యాలయంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వరద కాలువల పునరుద్దరణపై రివ్యూ నిర్వహించారు. మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, ప్రకాశ్ రెడ్డి, నాగరాజు, కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, అధికారులు రివ్యూలో పాల్గొన్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజి ఏర్పాటుకు పూర్తి స్థాయి డీపీఆర్ సిద్ధం చేయాలని ఎమ్మెల్యేలు అన్నారు.
News January 8, 2026
జగిత్యాల: ఆర్టీసీ రిటైర్డ్ కార్మికుల సంక్షేమానికి కృషి

ఆర్టీసీ రిటైర్డ్ కార్మికుల సంక్షేమానికి తనవంతు కృషి చేస్తానని టీఎస్‌ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల జోనల్, జిల్లా గౌరవాధ్యక్షుడు ఓరుగంటి రమణారావు తెలిపారు. గురువారం జగిత్యాల పట్టణంలోని ఎల్‌జీ గార్డెన్స్‌లో టీఎస్‌ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 2026 డైరీని ఆయన ఆవిష్కరించారు. అనంతరం నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. రాష్ట్ర,జోనల్ నాయకులు, పెద్ద సంఖ్యలో రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారు.
News January 8, 2026
సర్వే మిషన్లపై పూర్తి అవగాహన ఉండాలి: కలెక్టర్ స్నేహ శబరీష్

భూమి కొలతల్లో ఖచ్చితత్వం కోసం అత్యాధునిక సర్వే మిషన్లపై లైసెన్స్‌డ్ సర్వేయర్లు పూర్తి అవగాహన కలిగి ఉండాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో ధర్మసాగర్, హసన్ పర్తి మండలాల సర్వేయర్లకు నిర్వహిస్తున్న శిక్షణను ఆమె పరిశీలించారు. నూతన సాంకేతికతను అందిపుచ్చుకుని, భూముల సర్వేలో ఎటువంటి తప్పులు లేకుండా ఖచ్చితమైన కొలతలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.


