News April 24, 2025

29 పాఠశాలల్లో 100% ఉత్తీర్ణత: మంత్రి సవిత

image

పదో తరగతి పరీక్ష ఫలితాల్లో రాష్ట్రంలోని మహాత్మా గాంధీ జ్యోతిరావు ఫూలే పాఠశాలలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారని మంత్రి సవిత పేర్కొన్నారు. రాష్ట్రంలోని 29 పాఠశాలల్లో 100% ఉత్తీర్ణత నమోదైందని తెలిపారు. ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లోనూ ఇదే జోరు కొనసాగించారన్నారు. రాష్ట్ర స్థాయి సగటు ఫలితాలు 81.14% నమోదు కాగా ఎంజేపీ పాఠశాలల విద్యార్థులు 95 శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు.

Similar News

News April 17, 2026

BJP రాజకీయంతోనే బిల్లు వీగింది: KTR

image

TG: డీలిమిటేషన్ అంశాన్ని ముడిపెట్టడంతోనే మహిళా రిజర్వేషన్ల బిల్లు వీగిపోయిందని కేటీఆర్ విమర్శించారు. BRS సహా అన్ని పార్టీలు మహిళా రిజర్వేషన్లకు సానుకూలంగా ఉన్నా.. BJP రాజకీయంతోనే బిల్లు వీగిందని ఆరోపించారు. ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ సీట్లతోనే రిజర్వేషన్లను అమలు చేసి ఉంటే ఎటువంటి సమస్య వచ్చేది కాదన్నారు. ఇప్పటికైనా వెంటనే డీలిమిటేషన్ అంశంతో సంబంధం లేకుండా కొత్త బిల్లు తేవాలని డిమాండ్ చేశారు.

News April 17, 2026

కమిన్స్ ఎప్పటి నుంచి ఆడతారంటే?

image

IPL: SRH కెప్టెన్ పాట్ కమిన్స్ నేడు ఆ జట్టు క్యాంపులో చేరనున్నారని క్రీడావర్గాలు తెలిపాయి. అయితే రేపు చెన్నైతో జరిగే మ్యాచులో అతడు ఆడే అవకాశం లేదని పేర్కొన్నాయి. ఏప్రిల్ 25 నుంచి జరిగే మ్యాచులకు అందుబాటులో ఉండవచ్చని వెల్లడించాయి. కాగా కమిన్స్ రాకతో ఆరెంజ్ ఆర్మీ బౌలింగ్ దళం బలపడనుంది.

News April 17, 2026

భద్రతగా చేరడమే ‘అరైవ్ అలైవ్’ లక్ష్యం: కలెక్టర్

image

రహదారి ప్రయాణాల్లో ప్రతి ప్రాణం విలువైనదని, సురక్షితంగా గమ్యం చేరడమే ‘అరైవ్ అలైవ్’ లక్ష్యమని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పేర్కొన్నారు. జిల్లాలో 45 బ్లాక్ స్పాట్లను గుర్తించి నివారణ చర్యలు చేపట్టామన్నారు. 2023 నుంచి ఇప్పటివరకు వందలాది మంది ప్రమాదాల్లో మరణించడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడంపై గ్రామాల్లో తీర్మానాలు చేయాలని పిలుపునిచ్చారు.