News April 24, 2025
NRPT: ‘నకిలీ విత్తనాల అమ్మితే కఠినమైన చర్యలు’

నారాయణపేట జిల్లా పరిధిలోని ఆయా మండలాల్లో ఎవరైనా కల్తీ విత్తనాలు అమ్మితే కఠినమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ యోగేష్ గౌతం ఒక ప్రకటనలో తెలిపారు. ఊళ్లల్లోకి ప్యాకెట్లలో కాకుండా లూసుగా విత్తనాలు తీసుకొస్తే రైతులు తీసుకోవద్దని ఎస్పీ రైతులను కోరారు. ఫర్టిలైజర్ షాపుల్లో ప్యాకింగ్ లేబుల్ ఉన్న విత్తనాలు మాత్రమే కొనుక్కోవాలని రైతులను ఎస్పీ సూచించారు.
Similar News
News April 24, 2025
NLG: టీపీసీసీ పరిశీలకుల నియామకం!

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జిల్లాకు పరిశీలకులను నియమించింది. ఇందులో భాగంగా నల్గొండ జిల్లాకు మక్తల్ ఎమ్మెల్యే వి.శ్రీహరి ముదిరాజ్, నజీర్ అహ్మద్‌ను పరిశీలకులుగా నియమించింది. వీరు జిల్లాలో ప్రస్తుతం ఉన్న డీసీసీ అధ్యక్షులను కొనసాగించాలా..? లేక కొత్తవారిని నియమించాలా..? అనే దానిపై పార్టీ శ్రేణుల అభిప్రాయాలు సేకరించి అధిష్ఠానానికి నివేదిక సమర్పించనున్నారు.
News April 24, 2025
అమరావతిలో తొలి క్వాంటమ్ విలేజ్?

అమరావతిని దేశంలోని మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ విలేజ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. వెలగపూడిలో జరిగిన సమీక్షలో ఐటీ శాఖ కార్యాచరణను సిద్ధం చేసింది. 50ఎకరాల భూమిపై ఐకానిక్ భవనం నిర్మాణానికి L&T, టెక్నాలజీ మద్దతు కోసం ఐబీఎం ముందుకొచ్చాయి. టీసీఎస్, సీఎంఓ కార్యదర్శి ప్రద్యుమ్న, ఐటీ కార్యదర్శి భాస్కర్ తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో త్వరితగతిన పనులు పూర్తిచేయాలని ఆదేశించారు.
News April 24, 2025
వక్ఫ్ నిరసనలకు తాత్కాలిక బ్రేక్: ముస్లిం లా బోర్డు

పహల్గాం ఉగ్రదాడిపై ఆలిండియా ముస్లిం లా బోర్డు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ‘పహల్గాం దాడి చాలా విషాదకరం. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మృతుల కుటుంబాలకు మా ప్రగాఢ సంతాపం. ఈ విషాద సమయంలో వక్ఫ్ బిల్లుపై దేశవ్యాప్తంగా చేస్తున్న నిరసనలను 3రోజుల పాటు ఆపుతున్నాం’ అని ప్రకటించింది.