News April 24, 2025

ఒంగోలు: రేషన్ మాఫియా డాన్‌ పనేనా..?

image

వీరయ్య చౌదరి హత్య కేసులో ఓ రేషన్ మాఫియా డాన్ పేరు బలంగా వినిపిస్తోంది. ఒంగోలులో హత్య తర్వాత అతను ఫోన్ స్విచ్ఛాప్ చేశాడు. వాహనాలు మారుస్తూ గుంటూరు(D) వెదుళ్లపల్లికి వెళ్లి అక్కడ ఓ రైస్ మిల్లర్ నుంచి డబ్బులు తీసుకెళ్లినట్లు సమాచారం. ఆ మిల్లర్ సమాచారంతో డాన్‌కు సహకరించారన్న అనుమానాలతో నిడుబ్రోలుకు చెందిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, వీళ్లు ఎన్నికల్లో YCPకి అనుకూలంగా పనిచేశారని సమాచారం.

Similar News

News January 12, 2026

ప్రకాశం జిల్లాకు లేడీ ఆఫీసర్.. నేపథ్యం ఇదే.!

image

ప్రకాశం జిల్లా జేసీగా నియమితులైన <<18835611>>కల్పనా కుమారి<<>> ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన 2018 బ్యాచ్ IASగా ఎంపికయ్యారు. ఈమె సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్‌గా, విశాఖపట్నం JCగా, నంద్యాల సబ్ కలెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం గిరిజన సహకార సంస్థ ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈమె స్వస్థలం ఢిల్లీ కాగా, ఐఏఎస్‌కు ముందు ఇంజినీర్‌గా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

News January 12, 2026

ఒంగోలు: వివేకానంద సేవలు ఎనలేనివి

image

ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో స్వామి వివేకానంద జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజులు తదితరులు వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఆయన సేవలను కొనియాడారు. స్వామి వివేకానంద తన రచనల ద్వారా యువతకు మార్గదర్శకత్వం చేశారన్నారు.

News January 12, 2026

ప్రకాశం జిల్లాలో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక.!

image

ఒంగోలు కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కార్యాలయం తెలిపింది. జిల్లా కలెక్టర్ రాజాబాబు కార్యక్రమంలో పాల్గొని అర్జీదారుల సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటారన్నారు. అలాగే రెవెన్యూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కలెక్టర్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్ సైతం సోమవారం ఏర్పాటు చేశారు.