News April 24, 2025

స్వచ్ఛతలో అనంతపురం జిల్లాకు అవార్డు

image

స్వచ్ఛ ఆంధ్ర అమలులో అనంతపురం జిల్లాకు అవార్డు దక్కింది. రాష్ట్రంలోనే తొలి స్థానంలో అనంతపురం, ద్వితీయ స్థానంలో సత్యసాయి జిల్లా నిలిచాయి. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ కృష్ణతేజ ప్రకటించారు. నేడు విజయవాడలో జరగనున్న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంలో జిల్లా కలెక్టర్ డా.వినోద్ కుమార్ అవార్డును అందుకోనున్నారు.

Similar News

News August 23, 2025

బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా సందిరెడ్డి శ్రీనివాసులు

image

బీజేపీ నేత సందిరెడ్డి శ్రీనివాసులు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. శ్రీనివాసులు 1985లో అఖిల భారత విద్యార్థి పరిషత్‌లో చేరి కళాశాల కార్యదర్శిగా పనిచేశారు. 1990లో ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. అనంతరం బీజేపీలో చేరారు. అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా 2సార్లు బాధ్యతలు నిర్వర్తించారు. తాజాగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు.

News August 23, 2025

రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దు: కలెక్టర్

image

రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని, సరిపడా యూరియా అందుబాటులో ఉందని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. రైతులు మీ గ్రామ పరిధిలోని రైతు సేవా కేంద్రాలకు వెళ్లి ఎరువులను తీసుకోవచ్చన్నారు. రైతు సేవా కేంద్రం వద్ద సరిపడ స్టాక్ ఉందన్నారు. గ్రామ, మండల వ్యవసాయ అధికారులను, రైతు సేవా కేంద్రం సిబ్బందిని సంప్రదించాలన్నారు.

News August 22, 2025

M.Tech, M.Pharmacy పరీక్షా ఫలితాలు విడుదల

image

అనంతపురం JNTUలో జులైలో నిర్వహించిన M.Tech 1, 2, 3వ సెమిస్టర్ల, M.Phamarcy 1, 2, 3వ సెమిస్టర్ల రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఫలితాలను డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శివకుమార్ విడుదల చేశారు. విద్యార్థులు https://jntuaresults.ac.in/ వెబ్‌సైట్‌లో తమ రిజల్ట్స్ చూసుకోవచ్చన్నారు.