News April 24, 2025

భగ్గుమంటున్న కామారెడ్డి.. జర జాగ్రత్త!

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలోనే నిన్న అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కామారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రత 44 డిగ్రీలు దాటింది. జుక్కల్, డోంగ్లి మండలాల్లో 43.6 డిగ్రీలు, బిచ్కుంద మండలంలో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో రెండు రోజుల పాటు వడగాల్పులు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

Similar News

News August 23, 2025

KNR: విద్యార్థినులను కరిచిన ఎలుకలు..!

image

విద్యార్థినులను ఎలుకలు కరిచి గాయపరిచిన ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలోని కేశవపట్నం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో చోటు చేసుకుంది. విద్యార్థినులు రాత్రి పడుకున్న తర్వాత ఒక్కసారిగా వచ్చిన ఎలుకలు వారిని గాయపరిచాయి. ఈ సంఘటనలో 10 మంది విద్యార్థినుల వరకు గాయపడినట్లు సమాచారం. మిగతా విద్యార్థులు ఈ విషయం ఉపాధ్యాయులకు తెలియజేయడంతో గాయపడ్డవారికి గోప్యంగా స్థానిక PHCలో చికిత్స అందించారు.

News August 23, 2025

సుధాకర్ రెడ్డి కళ్లు, భౌతిక కాయం దానం

image

సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి(83) అనారోగ్యంతో <<17489969>>కన్నుమూసిన<<>> సంగతి తెలిసిందే. ఆయన నేత్రాలను ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి ఇచ్చారు. భౌతికకాయాన్ని గాంధీ మెడికల్ కాలేజీకి పరిశోధనల కోసం ఇవ్వనున్నారు. అభిమానుల సందర్శనార్థం ఆదివారం ఉదయం నుంచి మ.3 గంటల వరకు హిమాయత్‌నగర్‌లోని మగ్దూం భవన్‌లో భౌతిక కాయాన్ని ఉంచి, అనంతరం గాంధీ కాలేజీకి అప్పగిస్తారు. సుధాకర్ రెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

News August 23, 2025

నవంబర్‌లో ఇండియాకు లియోనల్ మెస్సీ!

image

ప్రపంచ దిగ్గజ ఫుట్‌బాల్ ఆటగాడు లియోనల్ మెస్సీ నవంబర్‌లో ఇండియాకు రానున్నట్లు కేరళ క్రీడాశాఖ మంత్రి వి.అబ్దుహ్మాన్ తెలిపారు. మెస్సీతోపాటు అర్జెంటీనా జట్టు మొత్తం కేరళకు వస్తుందని ఆయన ప్రకటించారు. తిరుప్పూర్ గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో జరిగే ఓ ఫ్రెండ్లీ మ్యాచులో అర్జెంటీనా తలపడనున్నట్లు పేర్కొన్నారు. కాగా అదే సమయంలో ముంబైలోని వాంఖడే స్టేడియంలో మెస్సీ క్రికెట్ కూడా ఆడతారని వార్తలు వస్తున్నాయి.