News April 24, 2025
రాంబిల్లి: తండ్రిని హత్య చేయించిన కొడుకు

రాంబిల్లి మండలం చినకలువలాపల్లిలో ఈ నెల 21న వడ్డీ వ్యాపారి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. జల్లి తాతారావును కొడుకు అప్పల రెడ్డే హత్య చేయించాడని సీఐ నరసింగరావు బుధవారం తెలిపారు. తండ్రి తన ఆస్తిని సవతి తల్లి కుమార్తెకు ఇచ్చేస్తాడని అనుమానించి ఇద్దరు వ్యక్తులను పురమాయించి హత్య చేయించినట్లు తెలిపారు. అప్పల రెడ్డితో పాటు మరో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.
Similar News
News April 24, 2025
ఉత్తమ అవార్డు అందుకున్న అనంతపురం కలెక్టర్

స్వచ్ఛ ఆంధ్ర (గ్రామీణ) కార్యక్రమాల అమలులో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అవార్డును అనంతపురం జిల్లా కలెక్టర్ డా.వినోద్ కుమార్ అందుకున్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అవార్డును అందజేశారు. గత ప్రభుత్వం పంచాయతీ నిధులన్నీ నిర్వీర్యం చేసిందని పవన్ విమర్శించారు. తాను ఇష్టంతో పంచాయతీరాజ్ శాఖను తీసుకున్నానని చెప్పారు. కలెక్టర్‌ను అభినందించారు.
News April 24, 2025
ఎల్కతుర్తి సభ ఏర్పాట్లపై సీపీతో సమావేశం

ఈనెల 27న ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ ఏర్పాట్లకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్‌తో సభ ఏర్పాట్లపై నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చర్చించారు. సభకు సంబంధించిన భద్రత ఏర్పాట్లు, ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తీసుకునే చర్యల గురించి రూట్ మ్యాప్ సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీతిసింగ్‌తో సమావేశం అయ్యారు.
News April 24, 2025
విశాఖలో పంచాయతీ రాజ్ దినోత్సవ వేడుకలు

జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం విశాఖ జిల్లా పరిషత్ కార్యాలయంలో గురువారం నిర్వహించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ జె.సుభద్రతో కలిసి కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ పాల్గొన్నారు. వీరు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బలమైన భారతదేశానికి బలమైన గ్రామ పాలన అవసరమని జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం గుర్తు చేస్తుందన్నారు.