News April 24, 2025

ప్రజల సూచనలను పరిగణలోకి తీసుకుంటాం: హైడ్రా

image

HYDలో చెరువుల సంరక్షణ, ప్రభుత్వ భూములను కాపాడడమే లక్ష్యంగా హైడ్రా పని చేస్తుందని కమిషనర్ రంగనాథ్ అన్నారు. ఈ పనిలో ప్రజల సూచనలను పరిగణనలోకి తీసుకొని ముందుకు వెళ్తున్నట్లుగా తెలిపారు. ఫిర్యాదులతో పాటు సూచనలు అందించడానికి సైతం హైడ్రా కార్యాలయానికి ప్రజలు రావచ్చని పేర్కొన్నారు. వచ్చిన ఫిర్యాదులపై వెంటనే పరిష్కారం చూపుతున్నట్లు తెలిపారు.

Similar News

News April 19, 2026

భీమేశ్వర సన్నిధిలో సినీ హీరోయిన్ అనన్య

image

వేములవాడలోని ప్రసిద్ధ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామిని సినీ హీరోయిన్ అనన్య నాగళ్ల శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కోడె మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు ఆమెకు ఆశీర్వచనం అందజేశారు. దేవస్థానం డీఈవో భాస్కర శర్మ ఆమెకు ప్రసాదం అందజేశారు.

News April 19, 2026

RCBకి శాపంగా గ్రీన్ జెర్సీ!

image

ఆర్సీబీకి మరోసారి గ్రీన్ జెర్సీ కలిసి రాలేదు. పర్యావరణ పరిరక్షణ కోసం 2011 సీజన్ నుంచి బెంగళూరు ప్లేయర్లు ఒక్కో మ్యాచులో ఈ గ్రీన్ కలర్ జెర్సీ ధరిస్తున్నారు. ఇప్పటివరకు ఈ జెర్సీలో 15 మ్యాచులు ఆడగా అందులో తొమ్మిదింట్లో (ఇవాళ ఢిల్లీతో కలిపి) ఓడింది. ఇక చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ ఆడిన తొలి, 50వ, 100వ మ్యాచుల్లో ఓటమిపాలు కావడం గమనార్హం.

News April 19, 2026

అంబేడ్కర్ కోనసీమ జిల్లా JCగా వైఖమ్

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా వైఖమ్ నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఇక్కడ జాయింట్ కలెక్టర్‌గా పని చేసిన నిశాంతి అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌గా బదిలీ కావడంతో వైఖమ్‌ను నియమించారు. ఆమె రెండు రోజుల్లో బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.