News April 24, 2025
చేగుంట: రోడ్డు ప్రమాదంలో RMP వైద్యురాలి మృతి

చేగుంట శివారులో 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్ఎంపీ వైద్యురాలు మృతి చెందినట్లు ఎస్ఐ చైతన్యకుమార్ రెడ్డి తెలిపారు. మేడ్చల్ జిల్లా గాజులరామారం వాసి కమ్మరి మంజుల(45) బుధవారం కూతురు ఉండే కామారెడ్డి జిల్లా రామారెడ్డి నుంచి స్వగ్రామానికి బైక్ పై వెళ్తుంది. చేగుంట వద్ద లారీ రోడ్డుపై నిర్లక్ష్యంగా నిలపడంతో బైక్ ఢీకొని మంజుల అక్కడికక్కడే మృతి చెందింది.
Similar News
News April 20, 2026
సీఎం BHPL పర్యటనకు 1,500 మందితో బందోబస్తు

CM రేవంత్ భూపాలపల్లి జిల్లా పర్యటన నేపథ్యంలో పోలీసు యంత్రాంగం పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసింది. సీఎం నేడు కాళేశ్వరం, మేడిగడ్డ, నస్తూరుపల్లి గ్రామాల్లో పర్యటించనున్నారు. ఉమ్మడి జిల్లాల ఎస్పీలు సంకీర్త్, శబరీష్ ఆధ్వర్యంలో 20 మంది డీఎస్పీలు, 50 మంది సీఐలు, 115 మంది ఎస్సైలతో పాటు సుమారు 1,500 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా పెంచారు.
News April 20, 2026
నిమ్మ.. ధర అదిరిందమ్మ

యాడికి మండలంలో నిమ్మకాయల ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 1100 కాయలున్న బస్తా ధర రూ.7 వేల నుంచి రూ.10 వేల వరకు పలుకుతోంది. మండల పరిధిలోని దాదాపు 1000 ఎకరాల్లో సాగవుతున్న ఈ పంటకు మంచి గిరాకీ ఏర్పడింది. ఇక్కడి దిగుబడి హైదరాబాద్, సిరిగొండ, హోస్పేట, బళ్లారి, హుబ్లీ వంటి నగరాలకు ఎగుమతి అవుతోంది. ఆశించిన లాభాలు వస్తుండటంతో సాగుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
News April 20, 2026
జగిత్యాల: 1230 రోజుల తర్వాత ‘గులాబీ బాస్’ పర్యటన

దాదాపు 1230 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జగిత్యాల పర్యటనకు రానున్నారు. గతంలో ముఖ్యమంత్రిగా పర్యటించిన ఆయన, ఇప్పుడు ప్రతిపక్ష నేతగా జిల్లాలో అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన చేసే వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ఎటువంటి మార్పులకు నాంది పలుకుతాయోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేసీఆర్ రాకతో గులాబీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది.


