News April 24, 2025
భగ్గుమంటున్న పాలమూరు.. జరభద్రం !

ఉమ్మడి పాలమూరు జిల్లాలో రోజురోజుకు ఎండలు భగ్గుమంటున్నాయి. తొలిసారి ఏప్రిల్ నెలలోనే అత్యధికంగా 43 డిగ్రీలపైగా ఉష్ణోగ్రత నమోదైంది. నిన్న వనపర్తి, గద్వాల జిల్లాల్లో 43 డిగ్రీలు, నారాయణంపేటలో 42.4, నాగర్ కర్నూల్ 42.1, మహబూబ్‌నగర్‌లో 42 డిగ్రీలు నమోదైంది. ముందు ముందు ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. అత్యవసరమైతేనే బయటకు రావాలని, జాగ్రత్తలు పాటించాలని పేర్కొంది.
Similar News
News April 18, 2026
సత్యసాయి: కార్లు అద్దెకు తీసుకుని మోసం.. నిందితుడి అరెస్ట్

కార్లను బాడుగకు తీసుకుని, యజమానులకు తెలియకుండా కుదువ పెట్టి మోసం చేసిన అన్నవరం గౌతం రాజును సత్యసాయి జిల్లా నల్లమాడ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు యజమానులను నమ్మించి మూడు కార్లు తీసుకుని, వాటిని ఇతరుల వద్ద కుదువ పెట్టి లక్షలాది రూపాయలు వసూలు చేశాడు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడి నుంచి మూడు కార్లను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.
News April 18, 2026
‘5 రాష్ట్రాలు దాటి వచ్చారా?’.. అల్లు అర్జున్ పిటిషన్‌పై ఢిల్లీ HC

తన పర్సనాలిటీ రైట్స్ పరిరక్షించాలని అల్లు అర్జున్ వేసిన పిటిషన్‌పై ఢిల్లీ HC ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘ఢిల్లీ, TGకి మధ్య 5 రాష్ట్రాలున్నాయి. ఇక్కడి వరకు ఎందుకు వచ్చారు’ అని జస్టిస్ తుషార్ రావు ప్రశ్నించారు. దీనిపై అల్లు అర్జున్ న్యాయవాది స్పందిస్తూ.. హక్కుల ఉల్లంఘన దేశమంతటా జరుగుతోందని, అందుకే రావాల్సి వచ్చిందని తెలిపారు. దీంతో బన్నీ వ్యక్తిగత హక్కులను పరిరక్షించాలని జడ్జి ఆదేశాలిచ్చారు.
News April 18, 2026
నెల్లూరు: ఉద్యోగులకూ సమస్యలు

నెల్లూరు కలెక్టరేట్ ఆవరణలోని తిక్కన ప్రాంగణంలో ఉద్యోగుల కోసం స్పెషల్ గ్రీవెన్స్ డే శుక్రవారం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి ఉద్యోగులు తరలి వచ్చారు. తమ సమస్యలను జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లుకు వివరించారు. ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. ఇప్పటి వరకు 4 శుక్రవారాలు ఉద్యోగుల గ్రీవెన్స్ డే చేపట్టగా.. 235 ఫిర్యాదులు వచ్చాయి. అందులో 172 పరిష్కారించారు.


