News April 24, 2025

కొరిశపాడు: గడ్డి మందు తాగి వివాహిత ఆత్మహత్య

image

కొరశపాడుకి చెందిన కాలే బిన్నీ తెలంగాణకు చెందిన వసంత (28)ని ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. గత 10 ఏళ్లుగా భర్త, అత్తమామలు, తోడికోడళ్ళతో కలిసి వసంత కొరిశపాడులోనే ఉంటుంది. అయితే కుటుంబ కలహాల కారణంగా మంగళవారం రాత్రి వసంత గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మరణించినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.

Similar News

News April 24, 2025

NZB: భద్రకాళి అమ్మవారి సన్నిధిలో MLC కవిత పూజలు

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ కవిత గురువారం వరంగల్‌లోని ప్రసిద్ధ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ ప్రజలందరి ఆయురారోగ్యాలు, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు తెలంగాణ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.

News April 24, 2025

MBNR: 12 వందల ఏళ్ల క్రితం నాటి శివలింగం చరిత్ర ఇదే.!

image

దాదాపు 12 వందల ఏళ్ల క్రితం కాకతీయుల రాజప్రతినిధులు గోన గన్నారెడ్డి పరిపాలిస్తున్న కాలంలో అడ్డాకుల మండలం రాచాలలో వెలసిన దివ్యక్షేత్రం రామలింగేశ్వర స్వామి ఆలయం నిర్మించబడినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. స్వామివారి లింగం, ఆలయ నిర్మాణ శైలి సైతం కాకతీయుల నిర్మాణాలను పోలి ఉండటం, కందూరు గ్రామ శాసనాలలో ఆలయ ప్రస్తావన ఉండటం ఇందుకు సాక్ష్యంగా పరిశీలకులు పరిగణిస్తున్నారు.

News April 24, 2025

SKZR: ‘కొడుకు పుట్టడం లేదని భార్యను చంపాడు’

image

కొడుకు పుట్టడం లేదని భార్యను భర్త చంపిన సంఘటన కాగజ్‌నగర్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. వంజరి గ్రామానికి చెందిన జయరాం కొడుకు కోసం బానక్కా అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెకి ఇద్దరు ఆడపిల్లలే పుట్టడంతో బుధవారం రాత్రి గొడవ జరిగింది. బానక్కను కొట్టడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

error: Content is protected !!