News April 24, 2025

NLG: వడదెబ్బకు పిట్టల్లా

image

భానుడి భగభగలతో ఉమ్మడి జిల్లా నిప్పుల కుంపటిలా మారింది. రోజురోజుకు ఎండల తీవ్రత అధికమవుతోంది. వడదెబ్బకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. తాజాగా సూర్యాపేట జిల్లా చిలుకూరులో ఉపాధి కూలీ కొడారు కోటయ్య (62) మృతి చెందారు. ఇటీవల పానగల్‌కు చెందిన కస్పరాలు కనకయ్య, కేతేపల్లి మండలం తుంగతుర్తి వాసి గుంటి వెంకటరమణ వడదెబ్బతో మృతిచెందారు. ఎండలకు బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.

Similar News

News April 24, 2025

కట్టంగూరు డీటీపై బదిలీ వేటు

image

కట్టంగూరు డీటీ జే.సుకన్యపై బదిలీ వేటు పడింది. అన్నారంలోని రామ్మూర్తి అనే రైతుభూమిని ఆమె వేరే వారి పేరు మీద బదిలీ చేసింది. బాధితుడు రామ్మూర్తి ఆర్డీవోకు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపారు. తప్పు తేలడంతో డీటీపై చర్యలు తీసుకున్నారు. సుకన్యను నల్గొండ కలెక్టరేట్‌కు అటాచ్ చేశారు.

News April 24, 2025

NLG: రిసోర్స్ పర్సన్స్ కోసం దరఖాస్తుల ఆహ్వానం

image

 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు మండల, జిల్లా స్థాయి రిసోర్స్ పర్సన్ల కోసం అర్హత, ఆసక్తిగల ఉపాధ్యాయులు ఈ నెల 24న దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ భిక్షపతి తెలిపారు. ఎంపికైన వారి వివరాలు ఈ నెల 28న ప్రకటిస్తామని పేర్కొన్నారు. వివరాలకు క్వాలిటీ కోఆర్డినేటర్ ఆర్.రామచంద్రయ్యను, సెల్ నంబర్ 79955 67558ను సంప్రదించాలని సూచించారు.

News April 24, 2025

రాష్ట్రంలో 10,590 మంది గ్రామ పాలన అధికారులు

image

భూముల రికార్డులను సక్రమంగా నిర్వహించడం, వివాదాలను తగ్గించేందుకు ప్రతి గ్రామానికి ఒక గ్రామ పాలన అధికారిని ప్రభుత్వం నియమిస్తుందని కలెక్టర్ త్రిపాఠి తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో 10,590 మంది గ్రామ పాలన అధికారులను నియమిస్తున్నట్లు చెప్పారు. గురువారం మునుగోడులో జరిగిన భూభారతి అవగాహన సదస్సులో మాట్లాడుతూ.. సర్వే సమస్యల పరిష్కారానికి 6000 మంది లైసెన్సుడ్ సర్వేయర్లను నియమించబోతుందని వెల్లడించారు.

error: Content is protected !!