News April 24, 2025
వత్సవాయి: తమ్ముడిని చంపిన అన్న

వత్సవాయి మండలం కాకరవాయిలో దారుణం చోటు చేసుకుంది. బుధవారం రాత్రి అన్నదమ్ముల మధ్య ఘర్షణ జరగగా, అన్న కొండ ఇనుప రాడ్డుతో తమ్ముడు అర్జున్ తలపై బలంగా కొట్టాడు. తీవ్రంగా గాయపడిన అర్జున్‌ను విజయవాడ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. నిందితుడు కొండను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Similar News
News September 8, 2025
MTM: మీకోసం కార్యక్రమంలో 42 ఫిర్యాదులు

మచిలీపట్నంలో సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ ఆర్. గంగాధరరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 42 ఫిర్యాదులు అందగా, ప్రతి సమస్యపై చట్టపరమైన విచారణ జరిపి తక్షణ పరిష్కారం అందిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. సంబంధిత పోలీస్ అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేశారు.
News September 8, 2025
యూరియా సరఫరాకు పటిష్ట చర్యలు: కలెక్టర్

యూరియా సరఫరాపై రైతులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నామని కలెక్టర్ డీకే బాలాజీ సీఎం చంద్రబాబుకు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం CM చంద్రబాబు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి వీసీలో పాల్గొన్న కలెక్టర్ బాలాజీ యూరియా సరఫరాకు జిల్లాలో చేపట్టిన చర్యలను సీఎంకు వివరించారు.
News September 8, 2025
శ్రీరామపాద క్షేత్రంలో సుందర దృశ్యం

నాగాయలంకలోని శ్రీరామపాద క్షేత్రంలో ఉన్న శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయం ఇటీవల కృష్ణానది వరదలకు శివలింగం, నంది వాహనం పూర్తిగా మునిగిపోయాయి. వరదలు తగ్గుముఖం పట్టడంతో ఆదివారం ఆలయాన్ని ప్రక్షాళన చేశారు. అనంతరం భక్తుల సందర్శన కోసం సిద్ధం చేయగా, సాయం సంధ్య వేళ రంగుల వర్ణాలతో ఆలయం ప్రత్యేకంగా కనిపించింది. ఈ సుందర దృశ్యం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.