News April 24, 2025
అంబేడ్కర్ కోనసీమ: ఆలోచింప చేస్తున్న చిత్రం

చిన్నపిల్లలు, యువకులు, పెద్దలు అంతా సెల్‌ఫోన్‌కు బానిసలుగా మారారు. తద్వారా తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. విద్యార్థి దశలో సెల్‌ఫోన్ వ్యసనంగా మారింది. టీచర్స్, పేరెంట్స్‌ను సైతం లెక్కచేయక తప్పుడు మార్గంలో పయనిస్తున్నారు. బుధవారం సెల్‌ఫోన్‌కు బానిసగా బారిన స్టూడెంట్ టీచర్‌పై చేయిచేసుకుంది. దీనిపై కాట్రేనికోనకు చెందిన చిత్రకారుడు అంజి ఆకొండి గీసిన చిత్రం ప్రజలను ఆలోచింపజేస్తోంది.
Similar News
News April 24, 2025
పరిశ్రమలు నెలకొల్పే ఔత్సాహికులకు పూర్తి సహకారం: కలెక్టర్

పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకు వచ్చే పారిశ్రామిక ఔత్సాహికులకు అన్ని విధాలుగా పూర్తి సహకారం అందించాలని అధికారులను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. నిర్మాణాలకు, పరిశ్రమల నిర్వహణకు అవసరమైన నీటి వనరులను సమకూర్చాలన్నారు. భూ సేకరణ, సింగిల్ విండో క్లియరెన్స్ అంశాల్లో వేగం పెంచాలని ఆదేశించారు.
News April 24, 2025
ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తప్పని నీటి కష్టాలు

ఎండల తీవ్రత పెరుగుతుండడంతో ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి నీటి కష్టాలు పొంచి ఉన్నాయి. ఓ పక్క భూగర్భ జలాలు అడుగంటడం, మరో పక్క మున్సిపల్ కార్పొరేషన్ నుంచి రోజు విడిచి రోజు నీటి సరఫరాతో కష్టాలు తప్పేలా లేవు. అంతేకాక బోర్ల ద్వారా కూడా సరఫరా తగ్గిపోతుండటంతో ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో ఈ ఏడాది నీళ్ల ముప్పు ఎదురుకానుంది. ఖమ్మం నగరంలో మంచినీటి సరఫరాకు ఇబ్బంది కలగకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
News April 24, 2025
ఆళ్లగడ్డ టాపర్‌కు జ్ఞాపిక అందజేసిన DEO

పదో తరగతి ఫలితాలలో ఆళ్లగడ్డకు చెందిన అచ్చుకట్ల మహమ్మద్ ఆదిల్ 596 మార్కులతో రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంకు సాధించారు. గురువారం డీఈవో జనార్దన్‌రెడ్డి ఈ విద్యార్థిని అభినందించి, ఆంధ్రప్రదేశ్ అన్ ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ జ్ఞాపికను బహుకరించారు. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొని రావాలని డీఈవో విద్యార్థికి సూచించారు.