News April 24, 2025
NGKL: ఇంటర్ విద్యార్థి సూసైడ్ !

తల్లిదండ్రులు మందలించారని ఇంటర్ విద్యార్థి సూసైడ్ చేసుకున్న ఘటన NGKL జిల్లాలో జరిగింది. స్థానికుల వివరాలిలా.. తెల్కపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడికి ఇంటర్ ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయని తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన యువకుడు ఉరేసుకోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. మార్కులు ముఖ్యం కాదని విద్యార్థులకు తల్లిదండ్రులు ధైర్యం చెప్పాలని నిపుణులు చెబుతున్నారు.
Similar News
News April 24, 2025
విశాఖను అమ్మేస్తున్నారు: కేశినేని నాని

ఉర్సా క్లస్టర్ సంస్థలకు భూకేటాయింపులపై విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని తాను చేసిన విమర్శలను సమర్ధించుకున్నారు. ఎవరు ఎన్ని జూమ్ మీటింగులు పెట్టి వివరణలు ఇచ్చినా “Vizag is for sale” అంటూ గురువారం నాని ట్వీట్ చేశారు. తనను ఎన్ని బూతులు తిట్టినా, చిప్ పోయిందని, సైకో అన్నా తనకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదని.. విశాఖలో ఇటీవల జరిపిన భూకేటాయింపులు సక్రమంగా లేవని నాని ఆరోపించారు.
News April 24, 2025
భూపాలపల్లి జిల్లాలో 40 డిగ్రీలు దాటిన ఎండ

భూపాలపల్లి జిల్లాలో ఎండలు తీవ్రంగా మారాయి. ఇటీవల వర్షాలు కురిసినప్పటికీ, గురువారం ఉష్ణోగ్రత 40 డిగ్రీలను దాటింది. ఈ ఊహించని వేడిమి వల్ల మధ్యాహ్నం రోడ్లపై జనసంచారం ఆగిపోయింది. చాలా మంది వడదెబ్బకు గురై, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ప్రజలు ఇంటిలోనే ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ అసాధారణ వాతావరణం ఇబ్బందులు కలిగిస్తోందని స్థానికులు తెలిపారు.
News April 24, 2025
NZB: భద్రకాళి అమ్మవారి సన్నిధిలో MLC కవిత పూజలు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ కవిత గురువారం వరంగల్‌లోని ప్రసిద్ధ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ ప్రజలందరి ఆయురారోగ్యాలు, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు తెలంగాణ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.