News April 24, 2025
కరీంనగర్ జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు

కరీంనగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా తిమ్మాపూర్ మండలంలో 44.7°C నమోదు కాగా, మానకొండూర్ 44.6, జమ్మికుంట 44.5, రామడుగు 44.4, చొప్పదండి 44.2, కరీంనగర్ 44.1, చిగురుమామిడి, కరీంనగర్ రూరల్ 44.0, వీణవంక, గంగాధర 43.9, శంకరపట్నం 43.4, గన్నేరువరం 43.3, కొత్తపల్లి, ఇల్లందకుంట 43.1, హుజూరాబాద్ 42.4, సైదాపూర్ 41.9°C గా నమోదైంది.
Similar News
News April 24, 2025
శంకరపట్నం: భూభారతి ఆర్ ఓ ఆర్ చట్టంపై అవగాహన

శంకరపట్నం మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో భూభారతి ఆర్ఓఆర్ చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ పమేల సత్పత్తి హాజరై మాట్లాడుతూ.. ఈ కొత్త చట్టం ద్వారా భూ హక్కులపై కొన్ని కొత్త సవరణలు, విచారణ అధికారం కల్పించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, ఎమ్మార్వో భాస్కర్, ఎంపీడీవో కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
News April 24, 2025
KNR: నేటి నుంచి బాలభవన్ లో వేసవి శిక్షణ

కలెక్టర్, విద్యాశాఖ సహకారంతో బాలభవన్ ఆధ్వర్యంలో నేటి నుంచి వేసవి శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయనిబాలభవన్ సూపరింటెండెంట్ కే.మంజుల దేవి ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 10 వరకు ప్రతీ రోజు ఉదయం 7 గం. నుంచి 12 గం. వరకు శిక్షణ తరగతులు ఉంటాయన్నారు. 5 నుంచి 16 సం. వయస్సు ఉన్న వారు అర్హులని చెప్పారు. ఆసక్తి గల వారు తమ ఆధార్, పాస్ పోర్ట్ సైజ్ ఫొటో తో అంబేడ్కర్ స్టేడియంలోని శిక్షణ శిబిరంలో నమోదు చేసుకోవాలన్నారు.
News April 24, 2025
కరీంనగర్: పాత వస్తువులకు వేలం: సీపీ

KNR పోలీస్ కమిషనరేట్‌లోని వివిధ విభాగాలకు చెందిన ఉపయోగింబడిన, పాత వస్తువులను వేలం వేయనున్నట్లు పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వేలం పాట కరీంనగర్ – సిరిసిల్ల బైపాస్ రోడ్డులోని కరీంనగర్ సిటీ ట్రైనింగ్ సెంటర్లో ఈ నెల 28న ఉదయం 10 గంటలకు వేలం నిర్వహించనున్నట్లు అన్నారు. ఆసక్తి ఉన్నవారు ఈ వేలం పాటలో పాల్గొనవచ్చని సీపీ తెలిపారు.