News April 24, 2025
ఆఫీస్‌కు వస్తారా.. మానేస్తారా?.. గూగుల్ అల్టిమేటం

ఇంటి నుంచి పనిచేస్తున్న ఉద్యోగులకు గూగుల్ అల్టిమేటం జారీ చేసింది. ఆఫీస్‌కు వస్తారా లేక పూర్తిగా మానేస్తారా అని ప్రశ్నిస్తూ ఉద్యోగులకు ఈ-మెయిల్ పంపినట్లు తెలుస్తోంది. హైబ్రిడ్ వర్క్ మోడల్‌లో పనిచేయాలని, ఇంటి నుంచే పనిచేస్తామంటే కుదరదని తేల్చిచెప్పినట్లు సమాచారం. ఏఐకి ప్రాధాన్యాన్ని ఇస్తున్న గూగుల్ ఇప్పటికే వేలాదిమంది ఉద్యోగుల్ని తొలగించింది.
Similar News
News April 24, 2025
‘రామాయణ్’లో సీత పాత్ర అందుకే తిరస్కరించా: శ్రీనిధి శెట్టి

నితీశ్ తివారీ తెరకెక్కిస్తోన్న ‘రామాయణ్’ సినిమాలో సీత పాత్రలో నటించమని తనకు ఆఫర్ వచ్చినట్లు హీరోయిన్ శ్రీనిధి శెట్టి తెలిపారు. అయితే ఇందులో యశ్ రావణుడి పాత్రలో నటిస్తున్నాడని తెలిసి ఆ పాత్ర వద్దనుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. యశ్‌తో కలిసి ఈ అమ్మడు KGF సిరీస్‌లో నటించిన సంగతి తెలిసిందే. కాగా ‘రామాయణ్’లో రాముడిగా రణ్‌బీర్, సీతగా సాయిపల్లవి కనిపించనున్నారు.
News April 24, 2025
దానం దారి.. అందుకే ‘మారుతోందా?’

ఖైరతాబాద్ MLA దానం నాగేందర్ BRSకు అనుకూల వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2023లో BRS నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరి అసెంబ్లీ సాక్షిగా గులాబీ సభ్యులపై దానం ధ్వజమెత్తడం అందరికీ తెలిసిందే. కానీ ఇటీవల BRSకు అనుకూలంగా <<16202054>>మాట్లాడుతున్నారు<<>>. పార్టీ ఫిరాయించిన వారిపై సుప్రీంలో విచారణ, బై పోల్ వస్తే సవాళ్లు, స్థానిక కాంగ్రెస్‌లో వర్గపోరు తదితరాలతో దానం మళ్లీ దారి మార్చుకున్నట్లు టాక్.
News April 24, 2025
PSL ప్రసారంపై నిషేధం

మన దేశంలో పాకిస్థాన్ సూపర్ లీగ్(PSL) ప్రసారంపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. పహల్‌గామ్‌లో ఉగ్రదాడిని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. భారత్‌లో PSLను స్పోర్ట్స్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఫ్యాన్‌కోడ్ లైవ్ ఇస్తోంది. కేంద్రం తాజా నిర్ణయంతో ఇవాళ్టి నుంచి PSL ప్రసారం ఆగిపోనుంది. భారత్ పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడబోదని ఇప్పటికే BCCI ప్రకటించిన విషయం తెలిసిందే.