News April 24, 2025
అనకాపల్లి: మే 19 నుంచి ఓపెన్ స్కూల్ సప్లమెంటరీ పరీక్షలు

అనకాపల్లి జిల్లాలో ఓపెన్ స్కూల్‌కు సంబంధించి సెకండరీ బోర్డు, 10వ తరగతి పరీక్షలు మే 19 నుంచి నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావు నాయుడు తెలిపారు. మే 28వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. ఈ నెల 24 నుంచి 30లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని సూచించారు. అధికారిక వెబ్‌సైట్‌లో హెచ్.ఎం లాగిన్ నుంచి ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు.
Similar News
News April 24, 2025
‘రామాయణ్’లో సీత పాత్ర అందుకే తిరస్కరించా: శ్రీనిధి శెట్టి

నితీశ్ తివారీ తెరకెక్కిస్తోన్న ‘రామాయణ్’ సినిమాలో సీత పాత్రలో నటించమని తనకు ఆఫర్ వచ్చినట్లు హీరోయిన్ శ్రీనిధి శెట్టి తెలిపారు. అయితే ఇందులో యశ్ రావణుడి పాత్రలో నటిస్తున్నాడని తెలిసి ఆ పాత్ర వద్దనుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. యశ్‌తో కలిసి ఈ అమ్మడు KGF సిరీస్‌లో నటించిన సంగతి తెలిసిందే. కాగా ‘రామాయణ్’లో రాముడిగా రణ్‌బీర్, సీతగా సాయిపల్లవి కనిపించనున్నారు.
News April 24, 2025
VKB: పురుగుమందు తాగిన కాంగ్రెస్ నాయకుడు

బషీరాబాద్ మండలంలో కాంగ్రెస్ పార్టీలో విభేదాలు బహిర్గతం అవుతున్నాయి. అధికార పార్టీలోని కొందరి వల్ల మనస్తాపం చెందిన ఓ నాయకుడు పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. గురువారం జరిగిన ఎమ్మెల్యే కార్యక్రమంలో మైలవర్ గ్రామానికి చెందిన బుచ్చిరెడ్డికి వేదికపై మాట్లాడటానికి అవకాశం ఇవ్వకపోవడంతో మనస్తాపంతో పురుగుమందు తాగాడు. వైద్యం కోసం VKB ఆసుపత్రికి తరలించారు.
News April 24, 2025
దానం దారి.. అందుకే ‘మారుతోందా?’

ఖైరతాబాద్ MLA దానం నాగేందర్ BRSకు అనుకూల వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2023లో BRS నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరి అసెంబ్లీ సాక్షిగా గులాబీ సభ్యులపై దానం ధ్వజమెత్తడం అందరికీ తెలిసిందే. కానీ ఇటీవల BRSకు అనుకూలంగా <<16202054>>మాట్లాడుతున్నారు<<>>. పార్టీ ఫిరాయించిన వారిపై సుప్రీంలో విచారణ, బై పోల్ వస్తే సవాళ్లు, స్థానిక కాంగ్రెస్‌లో వర్గపోరు తదితరాలతో దానం మళ్లీ దారి మార్చుకున్నట్లు టాక్.