News April 24, 2025

కర్రెగుట్టలో కాల్పుల మోత.. ముగ్గురు మావోయిస్టులు మృతి

image

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌లో సరిహద్దుల్లోని కర్రెగుట్ట ప్రాంతం కాల్పుల మోతతో దద్దరిల్లుతోంది. హిడ్మా, దేవా వంటి అగ్ర కమాండర్లు ఉన్నారన్న సమాచారంతో ఆ ప్రాంతాన్ని 3వేలకు పైగా బలగాలు చుట్టుముట్టాయి. నేలమీది నుంచి, గగనతలం నుంచి ముమ్మర కూంబింగ్‌తో ఆ ప్రాంతాన్ని దిగ్బంధించాయి. ఈక్రమంలో చోటు చేసుకున్న ఎన్‌కౌంటర్లో ముగ్గురు మావోలు మరణించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం.

Similar News

News April 24, 2025

దానం దారి.. అందుకే ‘మారుతోందా?’

image

ఖైరతాబాద్ MLA దానం నాగేందర్ BRSకు అనుకూల వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2023లో BRS నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరి అసెంబ్లీ సాక్షిగా గులాబీ సభ్యులపై దానం ధ్వజమెత్తడం అందరికీ తెలిసిందే. కానీ ఇటీవల BRSకు అనుకూలంగా <<16202054>>మాట్లాడుతున్నారు<<>>. పార్టీ ఫిరాయించిన వారిపై సుప్రీంలో విచారణ, బై పోల్ వస్తే సవాళ్లు, స్థానిక కాంగ్రెస్‌లో వర్గపోరు తదితరాలతో దానం మళ్లీ దారి మార్చుకున్నట్లు టాక్.

News April 24, 2025

PSL ప్రసారంపై నిషేధం

image

మన దేశంలో పాకిస్థాన్ సూపర్ లీగ్(PSL) ప్రసారంపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. పహల్‌గామ్‌లో ఉగ్రదాడిని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. భారత్‌లో PSL‌ను స్పోర్ట్స్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఫ్యాన్‌కోడ్‌ లైవ్ ఇస్తోంది. కేంద్రం తాజా నిర్ణయంతో ఇవాళ్టి నుంచి PSL ప్రసారం ఆగిపోనుంది. భారత్ పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడబోదని ఇప్పటికే BCCI ప్రకటించిన విషయం తెలిసిందే.

News April 24, 2025

ఉగ్రదాడి: అఖిలపక్ష సమావేశం ప్రారంభం

image

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఢిల్లీలో అఖిలపక్షం భేటీ అయింది. ఇందులో కేంద్రమంత్రులు అమిత్ షా, జైశంకర్, నిర్మల, జేపీ నడ్డా, కిరణ్ రిజిజు, విపక్ష నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ తదితరులు పాల్గొన్నారు. ఉగ్రదాడి అనంతరం ప్రభుత్వం తీసుకున్న చర్యలను మంత్రులు ఆ సమావేశంలో వివరిస్తున్నారు.

error: Content is protected !!