News April 24, 2025

నిజామాబాద్: ఈతకెళ్తున్నారా.. జర భద్రం !

image

స్కూళ్లకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఎండకాలంలో సేద తీరేందుకు పిల్లలు, పెద్దలు కలిసి ఈతకు వెళ్తుంటారు. బావులు, చెరువులు, నీటి ట్యాంకులు, కుంటల వద్ద ఈత కొడుతూ ఎంజాయ్‌ చేస్తారు. అయితే ఈత సరదా మాటున ప్రమాదం జరిగే అవకాశం ఉందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని NZB అధికారులు సూచించారు. సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా తల్లిందడ్రులు చూడాలన్నారు.

Similar News

News September 11, 2025

NZB: వాహనంపై నుంచి పడి వ్యక్తి మృతి

image

నిజామాబాద్ సుభాష్ నగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయాల పాలైన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు మూడో టౌన్ ఎస్ఐ హరిబాబు తెలిపారు. బుధవారం ఉదయం ఖిల్లా ప్రాంతానికి చెందిన మహేష్(32) వాహనంలో వెనుక కూర్చొని వెళ్తుండగా డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడం వల్ల మహేష్ కింద పడి గాయలపాలయ్యాడు. అతన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News September 11, 2025

నిజామాబాద్‌లో ఉద్యోగ మేళా

image

నిజామాబాద్ జిల్లా నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల 12న ఉద్యోగ మేళా నిర్వహిస్తునట్లు జిల్లా ఉపాధి అధికారి మధుసూధన్‌రావు తెలిపారు. సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, సేల్స్ మేనేజర్ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. అభ్యర్థులు ధ్రువ పత్రాలతో ఉపాధి కార్యాలయంలో హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాలకు 6305743423, 9948748428 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

News September 10, 2025

NZB: GGHలో వైద్య విభాగాలను తనిఖీ చేసిన DMHO

image

నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH)లో కొనసాగుతున్న వైద్య ఆరోగ్య శాఖకు చెందిన వివిధ వైద్య విభాగాలను DMHO డాక్టర్ బి.రాజశ్రీ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్షయ నియంత్రణ, రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమ విభాగం, న్యూట్రిషన్ రిహాబిలిటేషన్ కేంద్రాన్ని, SNCU విభాగాన్ని పరిశీలించారు. సిబ్బంది పనితీరును హాజరు పట్టికలను వివిధ రికార్డులను పరిశీలించి సూచనలు చేశారు.