News March 28, 2024
టెక్కలి మండలంలో విషాదం

మండలంలోని చిన్ననారాయణపురానికి చెందిన సాలిన రాము(42) అనే వ్యక్తి గురువారం సాయంత్రం మృతి చెందాడు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబసభ్యులు హుటాహుటీన టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించగా అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.
Similar News
News September 9, 2025
శ్రీకాకుళం: ఓటు హక్కును వినియోగించుకున్న కేంద్ర మంత్రి

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తన ఓటు హక్కును మంగళవారం వినియోగించుకున్నారు. ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డిలు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఉప రాష్ట్రపతి ఎన్నికకి సంబంధించిన పోలింగ్‌ను పార్లమెంటు ప్రాంగణంలో నిర్వహించారు. పార్లమెంటు సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
News September 9, 2025
మాజీ మంత్రి సీదిరి హౌస్ అరెస్ట్

ఎరువుల కొరతపై రైతన్నకు బాసటగా వైసీపీ ‘అన్నదాత పోరు’ కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ర్యాలీ, నిరసనలకు ఎలాంటి అనుమతులు లేవన్నారు. ప్రభుత్వం ఆంక్షలు విధించి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులను బయటకు రాకుండా చేయడం అన్యాయమని సీదిరి మండిపడ్డారు.
News September 9, 2025
శ్రీకాకుళం: టీనా మృతిపై ఎస్పీ దిగ్భ్రాంతి

పోలీసు శాఖలో 7 సంవత్సరాల పాటు విశేష సేవలందించిన పోలీసు జాగిలం ‘టీనా’ అనారోగ్యంతో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచింది. టీనా మృతి పట్ల ఎస్పీ మహేశ్వర్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆర్మ్డ్ రిజర్వ్ కార్యాలయం ఆవరణంలో ఇవాళ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. అదనపు ఎస్పీ కె.వి.రమణ తదితరులు నివాళులు అర్పించారు.