News April 24, 2025
నూజివీడు: ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ జారీ

రాష్ట్రంలోని ఆర్జీయూకేటీ త్రిబుల్ ఐటీల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల అయ్యింది . దీనిలో భాగంగా నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం త్రిబుల్ ఐటీల్లో 2025-26 విద్యాసంవత్సరానికి గానూ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు రిజిస్ట్రార్ ఆచార్య సండ్ర అమరేంద్ర కుమార్ గురువారం తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈనెల 27 నుంచి మే 20వ తేదీలోపు ఆర్జీయూకేటీ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.
Similar News
News April 24, 2025
భీమడోలు: తారాబు జలపాతం వద్ద యువకుడి గల్లంతు

పెదబయలు మండలంలో గల ప్రముఖ పర్యాటక ప్రాంతమైన తారాబు జలపాతంలో ఓ యువకుడు గల్లంతైనట్టు స్థానిక ఎస్‌ఐ రమణ తెలిపారు. పెందుర్తిలోని ఓ కాలేజీలో బీటెక్ చదువుతున్న నలుగురు యువకులు గురువారం జలపాతానికి వచ్చారన్నారు. వీరిలో ఏలూరు జిల్లా భీమడోలుకు చెందిన గొన్నూరి కిషోర్ (22) జలపాతంలో ఈత కొడుతూ గల్లంతయ్యాడని తెలిపారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా కిషోర్ ఆచూకీ లభ్యం కాలేదని వెల్లడించారు.
News April 24, 2025
మోదీ సర్కారుపై సంచలన ఆరోపణలు.. ఎమ్మెల్యే అరెస్టు

పహల్గామ్ ఉగ్రదాడిలో మోదీ సర్కారు కుట్ర ఉందన్న అస్సాం AIDUF ఎమ్మెల్యే <<16202042>>అమినుల్ ఇస్లాంను<<>> పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్థాన్‌కు సపోర్ట్ చేసినా, సపోర్ట్ చేయడానికి ప్రయత్నించినా సహించేది లేదని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ స్పష్టం చేశారు. సదరు ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కాగా దేశంలో మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తోందని అమినుల్ చేసిన కామెంట్స్ సంచలనమయ్యాయి.
News April 24, 2025
తారాబు జలపాతం వద్ద యువకుడి గల్లంతు

పెదబయలు మండలంలో గల ప్రముఖ పర్యాటక ప్రాంతమైన తారాబు జలపాతంలో ఓ యువకుడు గల్లంతైనట్టు స్థానిక ఎస్‌ఐ రమణ తెలిపారు. పెందుర్తిలోని ఓ కాలేజీలో బీటెక్ చదువుతున్న నలుగురు యువకులు గురువారం జలపాతానికి వచ్చారన్నారు. వీరిలో వెస్ట్ గోదావరి జిల్లా భీమడోలుకి చెందిన గొన్నూరి కిషోర్ (22) జలపాతంలో ఈత కొడుతూ గల్లంతయ్యాడని తెలిపారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా కిషోర్ ఆచూకీ లభ్యం కాలేదని వెల్లడించారు.