News April 24, 2025
ఎనుమాముల మార్కెట్‌లో భారీగా పెరిగిన పత్తి ధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మూడు రోజులుగా స్థిరంగా ఉన్న పత్తి ధర ఈరోజు భారీగా పెరిగింది. సోమవారం, మంగళవారం, బుధవారం క్వింటా పత్తి ధర రూ.7,560 పలకగా.. ఈరోజు రూ.7,700 ధర పలికినట్లు వ్యాపారులు తెలిపారు. ధర పెరగడం మంచి విషయం అయినప్పటికీ, పత్తి అందుబాటులో లేని సమయంలో ధర పలకడం పట్ల రైతులు నిరాశ చేందారు.
Similar News
News February 5, 2026
వాట్సాప్‌లో త్వరలో మరో కొత్త ఫీచర్

స్టేటస్ అప్‌డేట్స్‌కు సంబంధించి వాట్సాప్‌లో ‘custom lists’ ఫీచర్ త్వరలో రానుంది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కొలీగ్స్ ఇలా వేర్వేరు లిస్టులు క్రియేట్ చేసుకొని, వాటిలో మీకు కావాల్సిన లిస్టుకు స్టేటస్ షేర్ చేయవచ్చు. ప్రస్తుతం ‘మై కాంటాక్ట్స్, ఆల్ కాంటాక్ట్స్ ఎక్స్‌పెక్ట్, ఓన్లీ షేర్ విత్’ ఆప్షన్లు ఉండగా, స్టేటస్ పెట్టే టైమ్‌లో సెట్టింగ్స్ తరచుగా మార్చాల్సి వస్తోంది. ఈ కొత్త ఫీచర్ వస్తే ఇక ఆ ఇబ్బంది ఉండదు.
News February 5, 2026
కృష్ణా: నవోదయలో ఖాళీ సీట్ల భర్తీ.. అడ్మిట్ కార్డ్ విడుదల!

2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి వేలేరు జవహర్ నవోదయ విద్యాలయంలో 9, 11వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం ఈ నెల 7వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ డి. ఎదునందన తెలిపారు. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అడ్మిట్ కార్డులు విడుదల చేసినట్లు వెల్లడించారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను cbseitms.rcil.gov.inలో డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.
News February 5, 2026
ఎనుమాముల మార్కెట్‌లో పెరిగిన మిర్చి ధరలు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో గురువారం మిర్చి ధరలు కాస్త పెరిగాయి. వండర్ హాట్ బుధవారం క్వింటాకు రూ.37,100 ధర పలకగా, గురువారం క్వింటా రూ.900 పెరిగి రూ.38,000 అత్యధిక ధర పలికింది. యూఎస్ 341 రకానికి బుధవారం క్వింటాకు రూ.26,200 ధర పలకగా, గురువారం క్వింటాకు రూ.500 పెరిగి క్వింటాకు రూ.26,700 ధర పలికింది. తేజ రకం మిర్చి క్వింటాకు రూ.200 పెరిగి గురువారం క్వింటాకు రూ.19,500 ధర పలికింది.


