News April 24, 2025
పాకిస్థానీ అంటూ ఆరోపణలు: స్పందించిన ప్రభాస్ హీరోయిన్

తాను పాకిస్థాన్ సంతతి యువతినంటూ వస్తున్న వార్తల్ని ‘ఫౌజీ’ హీరోయిన్ ఇమాన్వీ ఖండించారు. ‘నేను పాకిస్థానీ సైనికాధికారి కూతురినన్నది పచ్చిఅబద్ధం. ఆన్‌లైన్ ట్రోలర్లు ఆ విషయాన్ని వ్యాప్తి చేశారు. మా తల్లిదండ్రులు లాస్‌ఏంజిలిస్‌కు వలస వెళ్లారు. నేను అక్కడే పుట్టాను. హిందీ, తెలుగు, గుజరాత్, ఇంగ్లిష్ మాట్లాడే భారత సంతతి అమ్మాయిని నేను. ఈ బాధాకర సమయంలో ద్వేషాన్ని కాదు.. ప్రేమను వ్యాప్తి చేయండి’ అని కోరారు.
Similar News
News April 24, 2025
‘రెట్రో’ కథ ఆ హీరో కోసం అనుకున్నా: కార్తీక్ సుబ్బరాజు

‘రెట్రో’ సినిమా కథను దళపతి విజయ్ కోసం రాశారన్న ప్రచారంపై దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు స్పందించారు. రజినీకాంత్ కోసం ఈ స్టోరీ రాసుకున్నట్లు వెల్లడించారు. సూపర్ స్టార్ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని కథను సిద్ధం చేశానని తెలిపారు. సూర్య రావడంతో పలు మార్పులు చేసినట్లు చెప్పారు. సినిమాలో రొమాంటిక్ డ్రామాను జోడించినట్లు పేర్కొన్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా మే 1న విడుదల కానుంది.
News April 24, 2025
అండమాన్‌లో మున్సిపల్ ఛైర్మన్ పదవి టీడీపీ కైవసం

అండమాన్ నికోబార్ దీవుల్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటింది. బీజేపీ మద్దతుతో సౌత్ అండమాన్‌లోని శ్రీవిజయపురం మున్సిపల్ ఛైర్మన్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. 24 మంది సభ్యులున్న కౌన్సిల్‌లో టీడీపీ 15 ఓట్లు రాబట్టి ఘనవిజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థిపై టీడీపీ అభ్యర్థి సాహుల్ హమీద్ గెలుపొందారు.
News April 24, 2025
భారత్, పాక్ సైనిక బలాలివే!

భారత్, పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో 2 దేశాల వద్ద ఉన్న సైనిక బలాలేంటో తెలుసుకుందాం.
♦ ఆర్మీ సైనికులు: 14,55,550 (భారత్), 6,54,000 (పాక్)
♦ వైమానిక ట్యాంకర్లు: 6 (భారత్), 4 (పాక్)
♦ అణు జలాంతర్గాములు: 293(భారత్), 121 (పాక్)
భారత్→ 2,299 ఎయిర్ క్రాఫ్ట్స్, 513 జెట్స్
పాక్→ 1,399 ఎయిర్ క్రాఫ్ట్స్, 328 జెట్స్
▶ అలాగే, భారత్ వద్ద 1.15M రిజర్వ్, 25 లక్షల పారా మిలిటరీ బలగాలున్నాయి.