News April 24, 2025

నిర్మల్: మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రవేశాలు

image

నిర్మల్ జిల్లాలోని మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ పురుషుల డిగ్రీ కళాశాలలో ప్రవేశాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా.బట్టు విజయ్ కుమార్ తెలిపారు. డిగ్రీ కళాశాలలో B.Sc, B.Com, BBA, BA విభాగాల్లో వివిధ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇంటర్ పూర్తయిన విద్యార్థులు మే 5 లోపు కళాశాలకి వచ్చి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Similar News

News April 24, 2025

తారాబు జలపాతం వద్ద పెందుర్తి విద్యార్థి గల్లంతు

image

పెందుర్తిలోని ఓ కాలేజీలో బీటెక్ చదువుతున్న విద్యార్థి తారాబు జలపాతంలో గల్లంతైనట్లు ఎస్‌ఐ రమణ తెలిపారు. నలుగురు యువకులు గురువారం జలపాతానికి వచ్చినట్లు చెప్పారు. వీరిలో వెస్ట్ గోదావరి జిల్లా భీమడోలుకి చెందిన గొన్నూరి కిషోర్ (22) జలపాతంలో ఈత కొడుతూ గల్లంతయ్యాడని తెలిపారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా కిషోర్ ఆచూకీ లభ్యం కాలేదని వెల్లడించారు.

News April 24, 2025

చింతలపూడి: పరారీలో ఉన్న నలుగురి అరెస్ట్

image

కామవరపుకోట మండలంలో పాత నాటు సారా కేసులలో పరారీలో ఉన్న నలుగురిని అరెస్ట్ చేసినట్లు చింతలపూడి ఎక్సైజ్ సీఐ అశోక్ తెలిపారు. జలపావారిగూడెంకు చెందిన జువ్వల సత్యవతి, వెంకటాపురానికి చెందిన రాజులపాటి దుర్గారావు, ఆడమిల్లికి చెందిన మిరియాల శరత్ కుమార్ (బెల్లం సరఫరా చేసిన వ్యక్తి), కొత్తగూడెంకి చెందిన రాచప్రోలు మల్లికార్జునరావులను అరెస్ట్ చేశామన్నారు. చింతలపూడి కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించారన్నారు.

News April 24, 2025

యూట్యూబ్‌లో అన్నమయ్య సంకీర్త‌న‌లు

image

తాళ్లపాక అన్నమయ్య సంకీర్తనలను ప్రజలందరికీ, ముఖ్యంగా యువ‌త‌కు యూట్యూబ్ ద్వారా చేరువ‌చేయాల‌ని టీటీడీ ఈవో జె.శ్యామ‌ల‌రావు అధికారుల‌ను ఆదేశించారు. తిరుప‌తి టీటీడీ ప‌రిపాల‌న భ‌వ‌నంలోని స‌మావేశ మందిరంలో వివిధ విభాగాల అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. సంకీర్తనలను ఎస్వీబీసీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.

error: Content is protected !!