News March 28, 2024

ఇతడు 200 మంది పిల్లలకు తండ్రి

image

బ్రెజిల్‌కు చెందిన నల్లజాతి బానిస పటా సెకా 200 మంది పిల్లలకు తండ్రయ్యాడు. ఏడడుగులు, కండలు తిరిగిన దేహంతో ఆజానుబాహుడిగా ఉండేవాడు. 19వ శతాబ్దంలో బానిసల యజమానులు అతడిని బానిసగా మార్చి నల్లజాతి యువతులు, మహిళలతో సంపర్కం చేయించేవారు. అలా పలువురు యువతులు, మహిళలకు 200 మందికిపైగా పిల్లలు పుట్టారు. అతడి వల్ల జన్మించే బిడ్డలను 11 ఏళ్లకే కష్టమైన పనులకు ఉపయోగించుకునేవారు. సెకా 130 ఏళ్లు బతికినట్లు సమాచారం.

Similar News

News October 5, 2024

గంభీర్ నా సోదరుడి లాంటివాడు: అక్మల్

image

టీమ్ ఇండియా కోచ్ గంభీర్, పాక్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ తరచూ గొడవ పడేవారన్న సంగతి తెలిసిందే. 2010లో ఆసియా కప్ సందర్భంగా ఒకరినొకరు సవాలు చేసుకోగా అంపైర్లు జోక్యం చేసుకుని విడిపించారు. అయితే అదంతా గ్రౌండ్ వరకేనని అక్మల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తమ ఇద్దరికీ వివాదాలేవీ లేవని, ఆయన తనకు సోదరుడితో సమానమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇద్దరం మంచి స్నేహితులమని వివరించారు.

News October 5, 2024

భారత మహిళల జట్టు ఓటమి

image

WT20 వరల్డ్ కప్‌ తొలి మ్యాచ్‌లో భారత్ ఓటమి మూటగట్టుకుంది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 58 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 160 రన్స్ చేసింది. 161 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ ఆరంభించిన భారత్ ఏ దశలోనూ టార్గెట్ ఛేదించేలా కనిపించలేదు. మంధాన(12), షఫాలీ(2) హర్మన్(15), రోడ్రిగ్స్(13), రిచా(12) పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో IND 102కే ఆలౌట్ అయింది.

News October 5, 2024

మద్యపాన ప్రియులకు క్యాన్సర్ ముప్పు

image

మద్యం ఎక్కువ సేవించేవారికి క్యాన్సర్ ముప్పు అధికంగా ఉంటుందని అమెరికన్ క్యాన్సర్ పరిశోధన సంఘం తాజాగా హెచ్చరించింది. ప్రధానంగా కాలేయం, కడుపు, అన్నవాహిక, పెద్ద పేగు, రొమ్ము, మెడ, తల భాగాలకు క్యాన్సర్లు సోకే ప్రమాదం ఉంటుందని తెలిపింది. మద్యపానం అదుపులో లేకపోతే జీవన ప్రమాణం గణనీయంగా తగ్గిపోతుందని హెచ్చరించింది. ఆ ఒక్క అలవాటును నియంత్రిస్తే 40శాతం క్యాన్సర్లను తగ్గించవచ్చని పేర్కొంది.