News April 24, 2025
ఇది భారత్‌పై దాడి: ప్రధాని మోదీ

పహల్‌గామ్‌లో పర్యాటకులపై దాడిని భారత్‌పై దాడిగా ప్రధాని మోదీ అభివర్ణించారు. మృతుల కుటుంబాలకు దేశం మొత్తం అండగా ఉంటుందన్నారు. ఈ నరమేధాన్ని ప్రపంచ దేశాలన్నీ ముక్తకంఠంతో ఖండించాయని మోదీ గుర్తు చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఉగ్రవాదులను విడిచిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. ఆప్తులను కోల్పోయినవారికి న్యాయం చేయడానికి అన్ని చర్యలు చేపడతామని వెల్లడించారు.
Similar News
News April 24, 2025
యుద్ధానికి సిద్ధమవుతోన్న పాక్!

భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతున్న PAK కవ్వింపు చర్యలకు దిగుతోంది. ఇందులో భాగంగా LOCకి అటువైపు ఆర్మీ దళాలను భారీగా మోహరిస్తోంది. కేవలం బంకర్ల నుంచే నిఘా ఉంచాలని సైనికులను ఆదేశించింది. రావల్పిండి కేంద్రంగా పని చేస్తున్న 10దళాల సైనికులను అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని PAK ఆర్మీ ఆదేశించింది. LOCతో పాటు అంతర్జాతీయ సరిహద్దులైన సియాల్‌కోట్, గుజ్రాన్‌వాలా వద్ద ఉన్న సైనికులనూ అలర్ట్ చేసింది.
News April 24, 2025
ఎన్‌కౌంటర్‌పై బస్తర్ ఐజీ కీలక ప్రకటన

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ పరిధిలో కర్రెగుట్ట ఎన్‌కౌంటర్‌పై బస్తర్ ఐజీ సుందర్ రాజ్ కీలక ప్రకటన చేశారు. ముగ్గురు మహిళా మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆపరేషన్ కొనసాగుతోందన్నారు. ఇందులో డీఆర్‌జీ, కోబ్రా, ఎస్‌టీఎఫ్, సీఆర్‌పీఎఫ్ టీమ్స్ పాల్గొన్నాయని వెల్లడించారు. భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మావోల సామగ్రి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
News April 24, 2025
ఇది మీ స్థాయి.. ఇక్కడ కూడా కాపీనేనా?

ఉగ్రదాడికి కౌంటర్‌గా పాకిస్థాన్‌పై భారత్ నిన్న ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. తాజాగా పాకిస్థాన్ సైతం అదే దారిలో నడిచింది. వీసాల రద్దు, హైకమిషన్ కార్యాలయంలో దౌత్య సిబ్బంది తగ్గింపు, అట్టారీ వాఘా బోర్డర్ మూసివేత, వాణిజ్య కార్యకలాపాల రద్దు ఇలా ప్రతి దాంట్లోనూ మనల్నే కాపీ కొట్టింది. ఇక 1972లో కుదిరిన షిమ్లా ఒప్పందాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు ఆ దేశం ప్రకటించింది.