News April 24, 2025

రేపు ఆకాశం ‘నవ్వుతుంది’

image

ఆనందానికి చిహ్నమైన స్మైలీ ఫేస్ రేపు తెల్లవారుజామున ఆకాశంలో ఆవిష్కృతం కానుంది. 5.30 గంటలకు శుక్రుడు, శని గ్రహాలు నెలవంకకు అతి చేరువగా రానున్నాయి. శుక్రుడు, శని 2 కళ్లుగా, నెలవంక నవ్వుతున్నట్లుగా కనిపించనుంది. సూర్యోదయానికి ముందు మాత్రమే ఈ ఖగోళ అద్భుతాన్ని వీక్షించవచ్చని నాసా తెలిపింది. మన కళ్లతో నేరుగా దీన్ని చూడొచ్చని, టెలిస్కోప్, బైనాక్యులర్లతో మరింత క్లారిటీగా కనిపిస్తుందని వెల్లడించింది.

Similar News

News August 16, 2025

యుద్ధాన్ని శాంతియుతంగా ముగించేలా చర్చలు: ట్రంప్

image

అలాస్కాలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశం విజయవంతంగా సాగినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని శాంతియుతంగా ముగించే దిశగా చర్చలు సాగాయన్నారు. ఇదే విషయమై జెలెన్ స్కీ, ఈయూ నేతలు, నాటో జనరల్ సెక్రటరీతో ఫోన్‌లో మాట్లాడినట్లు వెల్లడించారు. ఎల్లుండి జెలెన్‌స్కీ అమెరికాకు వస్తారని, అన్ని సక్రమంగా జరిగితే పుతిన్‌తో మరోసారి సమావేశం అవుతామన్నారు.

News August 16, 2025

పారదర్శకంగానే ఎలక్టోరల్ రోల్స్: ఈసీ

image

ఎలక్టోరల్ రోల్స్‌పై పలు పార్టీలు అనుమానాలు లేవనెత్తడంపై ECI ప్రకటన జారీ చేసింది. ఎలక్టోరల్ రోల్స్ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తాయని, వీటి ప్రిపరేషన్లో ప్రతి దశలోనూ రాజకీయ పార్టీలు పాల్గొంటాయంది. తప్పులు గుర్తించేందుకు తగిన సమయం ఉంటుందని పేర్కొంది. సరైన సమయంలో సమస్యలు లేవనెత్తితే పరిష్కారానికి అవకాశం ఉంటుందని తెలిపింది. చట్ట ప్రకారం, పారదర్శకంగానే ఎలక్టోరల్ రోల్ సిద్ధం చేస్తామని స్పష్టం చేసింది.

News August 16, 2025

పిల్లల్ని కనే రోబో.. 9 నెలల్లో డెలివరీ!

image

కృత్రిమ గర్భంతో పిల్లల్ని కనే రోబోను చైనా అభివృద్ధి చేస్తోంది. సింగపూర్‌ నాన్యాంగ్ వర్సిటీ సైంటిస్ట్ డా.జాంగ్ కిఫెంగ్ నేతృత్వంలో ‘ప్రెగ్నెన్సీ రోబో’ను పరిశోధకులు డెవలప్ చేస్తున్నారు. ఇందులో ఆర్టిఫీషియల్ అమ్నియోటిక్ ఫ్లూయిడ్‌ను ప్రవేశపెట్టి, ట్యూబ్ ద్వారా న్యూట్రియెంట్స్ అందిస్తారు. 9 నెలల్లో శిశువు తయారవుతుంది. 2026 నాటికి రోబో నమూనా తయారవుతుందని, ఇందుకోసం ₹12.96L ఖర్చవుతుందని చెబుతున్నారు.