News March 28, 2024

జగన్ ఒక్క ఎకరాకూ నీళ్లివ్వలేదు: చంద్రబాబు

image

AP: సీఎం జగన్ రాష్ట్రంలో ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదని టీడీపీ చీఫ్ చంద్రబాబు అన్నారు. ‘రాయలసీమ కోసం వైసీపీ చేసిందేమీ లేదు. 142 ప్రాజెక్టులను రద్దు చేశారు. టీడీపీ హయాంలో రాయలసీమలో సాగు నీటి కోసం రూ.12 వేల కోట్లు ఖర్చు చేశాం. కానీ జగన్ మాత్రం రూ.2 వేల కోట్లే ఖర్చు చేశారు. రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేశారు. రాష్ట్రాన్ని కాపాడడానికే టీడీపీ, బీజేపీ, జనసేన కలిశాయి’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News October 5, 2024

చైనాలో ఏటా టన్నుల కొద్దీ పాములు స్వాహా!

image

చైనీయులు ఏటా ఏకంగా 10వేల టన్నులకు పైగా పాముల్ని స్వాహా చేస్తున్నారని ఆ దేశ వన్యప్రాణ సంరక్షణ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రధానంగా షాంఘై, గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్సుల్లో సర్పాలకు మహా డిమాండ్. ఒక్క షాంఘైలోనే 6వేల వరకూ పాము మాంసం హోటళ్లు ఉండటం గమనార్హం. తాచుపాముల నుంచి సముద్రపు పాముల వరకూ అన్నింటినీ చైనీయులు ఇష్టంగా తినేస్తారు. దీని వల్ల పర్యావరణ అసమతుల్యత తలెత్తే ప్రమాదం ఉందంటూ సంస్థ హెచ్చరించింది.

News October 5, 2024

గంభీర్ నా సోదరుడి లాంటివాడు: అక్మల్

image

టీమ్ ఇండియా కోచ్ గంభీర్, పాక్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ తరచూ గొడవ పడేవారన్న సంగతి తెలిసిందే. 2010లో ఆసియా కప్ సందర్భంగా ఒకరినొకరు సవాలు చేసుకోగా అంపైర్లు జోక్యం చేసుకుని విడిపించారు. అయితే అదంతా గ్రౌండ్ వరకేనని అక్మల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తమ ఇద్దరికీ వివాదాలేవీ లేవని, ఆయన తనకు సోదరుడితో సమానమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇద్దరం మంచి స్నేహితులమని వివరించారు.

News October 5, 2024

భారత మహిళల జట్టు ఓటమి

image

WT20 వరల్డ్ కప్‌ తొలి మ్యాచ్‌లో భారత్ ఓటమి మూటగట్టుకుంది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 58 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 160 రన్స్ చేసింది. 161 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ ఆరంభించిన భారత్ ఏ దశలోనూ టార్గెట్ ఛేదించేలా కనిపించలేదు. మంధాన(12), షఫాలీ(2) హర్మన్(15), రోడ్రిగ్స్(13), రిచా(12) పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో IND 102కే ఆలౌట్ అయింది.