News April 24, 2025
పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఉండవు: బీసీసీఐ

ఇకపై భారత్, పాక్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లు ఉండబోవని BCCI వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. IND, PAK మధ్య చివరగా 2012-13లో ద్వైపాక్షిక సిరీస్ జరిగింది. అప్పటి నుంచి ICC టోర్నీల్లో మాత్రమే IND, PAK తలపడుతున్నాయి. తాజా ఘటన నేపథ్యంలో ఇక భవిష్యత్తులోనూ ద్వైపాక్షిక సిరీస్‌లు నిర్వహించవద్దని BCCI నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Similar News
News April 25, 2025
రేపటి నుంచి భారీ వర్షాలు

TG: రాష్ట్రంలో రేపటి నుంచి వర్షాలు మొదలవుతాయని తెలంగాణ వెదర్‌మ్యాన్ అంచనా వేశారు. రేపటితో వడగాలులు ముగుస్తాయని పేర్కొన్నారు. ఏప్రిల్ 25 నుంచి 27 వరకు భారీ వర్షాలు, ఈదురుగాలులు వీస్తాయని, ముఖ్యంగా 26న వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. హైదరాబాద్ నగరంలోనూ వర్షాలు కురుస్తాయని వివరించారు.
News April 25, 2025
ఉగ్రదాడిని పాకిస్థాన్ ఒప్పుకున్నట్లేనా?

ఉగ్రదాడిలో PAK హస్తముందని ఆరోపిస్తూ IND ఆంక్షలు విధించింది. ఈ క్రమంలో గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు పాక్ తీరు తప్పును ఒప్పుకున్నట్లే ఉంది. దాడి చేయకపోతే, చేయలేదని చెప్పకుండా ప్రతీకార చర్యలకు దిగింది. సరిహద్దులకు సైన్యాన్ని పంపి యుద్ధానికి సై అంటోంది. IND ఆరోపణలు అవాస్తమైతే దౌత్య సంబంధాలు దెబ్బతినకుండా వ్యవహరించాల్సింది పోయి PAK వ్యవహరిస్తున్న తీరు దోషినని ఒప్పుకున్నట్లుగానే ఉంది.
News April 24, 2025
మేడిగడ్డ బ్యారేజీపై సంచలన నివేదిక!

TG: మేడిగడ్డలోని బ్లాక్‌లను పూర్తిస్థాయిలో పరీక్షించాలని NDSA నివేదిక పేర్కొంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై అధ్యయనం చేసిన కమిటీ రిపోర్ట్‌ను ప్రభుత్వానికి అందజేసింది. బ్యారేజీలలో నిర్వహణ లోపాలే సమస్యలు తెచ్చిపెట్టాయని తెలిపింది. మేడిగడ్డ బ్లాక్-7 ఎక్కువ దెబ్బతిందని, ప్రాజెక్ట్ వినియోగం ముప్పేనని తేల్చి చెప్పింది. నిర్మాణ లోపాలపై నిపుణుల పరిశీలన అవసరమని సూచించింది.