News April 24, 2025
నాగల్ గిద్ద: భూభారతి చట్టంతో రైతులకు మేలు: కలెక్టర్

భూభారతి చట్టంతో రైతులకు మేలు జరుగుతుందని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. నాగల్ గిద్దలో భూభారతి చట్టంపై అవగాహన సమావేశం గురువారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ చట్టంతో భూమికి సంబంధించిన సమస్యలను సత్వరమే పరిష్కరిస్తారని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి, అదనపు కలెక్టర్ మాధురి పాల్గొన్నారు.
Similar News
News April 25, 2025
నంద్యాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

☞టెన్త్ టాపర్ ఆదిల్‌కు DEO అభినందన☞శోభనాగిరెడ్డి వర్ధంతి వేడుకల్లో భావోద్వేగానికి గురైన భూమా మౌనిక☞మిస్ యూ అమ్మా.. MLA భూమా అఖిలప్రియ ఎమోషనల్.!☞రహదారి ప్రమాదాల నివారణకు చర్యలు: జేసీ☞పహాల్గమ్ ఉగ్రదాడిని నిరసిస్తూ నంద్యాలలో ర్యాలీ☞ఉగ్రదాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి: మన్నే☞బ్రేకులు ఫెయిల్.. శ్రీశైలం ఘాట్‌లో ప్రమాదం.
News April 25, 2025
భయపడుతున్న పాకిస్థాన్?

పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ తర్వాత భారత్ ఏ క్షణమైనా తమపై విరుచుకుపడొచ్చని పాకిస్థాన్ భయపడుతున్నట్టు తెలుస్తోంది. భారత పౌర విమానాలు, మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్‌లు తమ గగనతలంలోకి రాకుండా నిషేధించింది. లష్కర్-ఎ-తోయిబా ప్రధాన కార్యాలయంపై ఇండియా ఎయిర్ స్ట్రైక్ చేయొచ్చని పాక్ అంచనా వేస్తోంది. దీంతో పాకిస్థాన్ ఎయిర్‌ఫోర్స్ ‘PAF హెర్క్యులస్’ ద్వారా పెద్దఎత్తున తరలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం.
News April 25, 2025
రేపటి నుంచి భారీ వర్షాలు

TG: రాష్ట్రంలో రేపటి నుంచి వర్షాలు మొదలవుతాయని తెలంగాణ వెదర్‌మ్యాన్ అంచనా వేశారు. రేపటితో వడగాలులు ముగుస్తాయని పేర్కొన్నారు. ఏప్రిల్ 25 నుంచి 27 వరకు భారీ వర్షాలు, ఈదురుగాలులు వీస్తాయని, ముఖ్యంగా 26న వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. హైదరాబాద్ నగరంలోనూ వర్షాలు కురుస్తాయని వివరించారు.