News April 24, 2025
సిరిసిల్ల: వరి ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలి: కలెక్టర్

యాసంగి పంట కొనుగోలులో వేగం పెంచాలని, కొనుగోలు కేంద్రాలకు వచ్చే నాణ్యమైన వరి ధాన్యాన్ని సత్వరమే కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లోని ధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. మాట్లాడుతూ.. రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా జరగాలని అన్నారు. డీఆర్డిఓ శేషాద్రి, తదితరులున్నారు.
Similar News
News April 24, 2025
బీచ్ కబడ్డీకి ఉమ్మడి గుంటూరు జిల్లా జట్ల ఎంపిక

కాకినాడలో మే 2 నుంచి 4 వరకు జరిగే అంతర్ జిల్లా బీచ్ కబడ్డీ పోటీలకు ఉమ్మడి గుంటూరు జిల్లా పురుషులు, మహిళల జట్లు ఎంపికయ్యాయి. గురువారం బాపట్ల మున్సిపల్ హైస్కూల్‌లో జరిగిన సెలెక్షన్స్‌లో 9 మంది పురుషులు, ఆరుగురు మహిళలు ఎంపికయ్యారు. అనంతరం ఇండియా క్యాంప్‌నకు ఎంపికైన గోపీచంద్‌ను సన్మానించారు. కబడ్డీ సంఘ నాయకులు, కోచ్‌లు, పీడీలు పాల్గొన్నారు.
News April 24, 2025
IPL: ఆర్సీబీ స్కోర్ ఎంతంటే?

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో RRతో జరిగిన మ్యాచ్‌లో RCB 20 ఓవర్లలో 205 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(70), దేవదత్ పడిక్కల్(50) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ 26 పరుగులతో శుభారంభం అందించారు. చివర్లో టిమ్ డేవిడ్(23), జితేశ్ శర్మ(20*) బౌండరీలతో మెరిపించారు. సందీప్ శర్మ 2 వికెట్లు తీశారు. RR టార్గెట్ 206.
News April 24, 2025
నాయీ బ్రాహ్మణుల కమీషన్ పెంపు

AP: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయాల్లో నాయీ బ్రాహ్మణులకు కనీస కమీషన్‌ను రూ.20వేల నుంచి రూ.25వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. 6ఏ కేటగిరీలోని 44 దేవాలయాల్లో పనిచేస్తున్న వారికి వర్తించేలా ఉత్తర్వుల్లో పేర్కొంది. కనీసం ఆలయాల్లో 100 రోజుల పాటు సేవలు అందించేవారికి ఈ పెంపు వర్తించనుంది. ఏడాదికి రూ.50లక్షల నుంచి రూ.2 కోట్లు ఆదాయం వచ్చే ఆలయాలు 6A కేటగిరీలోకి వస్తాయి.