News April 24, 2025
కడప: నోటిఫికేషన్ విడుదల

ఏపీలో టెన్త్ ఫలితాలు వెలువడడంతో రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (RGUKT- AP) పరిధిలోని ఒంగోలు, ఇడుపులపాయ ఐఐఐటీలో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశాల నోటిఫికేషన్‌ను ఆర్జీయూకేటీ అధికారులు విడుదల చేశారు. ఈనెల 27న ఉ. 10 గంటల నుంచి మే 20వ తేదీ సా. 5 గంటల వరకు దరఖాస్తు గడువు ఉంటుందన్నారు. అర్హులైన విద్యార్థులు యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Similar News
News April 24, 2025
టిడ్కో ఇళ్ల నిర్మాణాలు, అప్పగింతపై సమీక్ష

విశాఖ కలెక్టరేట్లో టిడ్కో ఇళ్ల నిర్మాణాలు, అప్పగింతపై గురువారం సమీక్ష జరిగింది. ఏపీ టిడ్కో మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి కలెక్టర్ హరేంధిర ప్రసాద్‌తో కలిసి అధికారులతో సమావేశమయ్యారు. ప్రభుత్వ జీవో నం.39 ప్రకారం ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న టిడ్కో ఇళ్ల రిజిస్ట్రేషన్స్‌పై చర్యలు తీసుకోవాలన్నారు. టిడ్కో ఇళ్లకు లోన్స్‌పై బ్యాంకు అధికారులతో చర్చించి సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
News April 24, 2025
మెదక్: రోడ్డు ప్రమాదంలో కూలీ మృతి

మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన గఫూర్ అనే వ్యక్తి దౌల్తాబాద్‌లో కూలీ పని కోసం వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో పులిమామిడి వద్ద బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. 108 వాహనంలో సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారని స్థానికులు తెలిపారు.
News April 24, 2025
చిన్నగంజాంలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలం గొనసపూడి- తిమ్మసముద్రం రోడ్డు మార్గంలో గురువారం ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. కూలీలతో వెళుతున్న ఆటో ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ప్రమాదంలో కడవకుదురు గ్రామానికి చెందిన మహిళా కూలీ సోమమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. మరో ఆరుగురు కూలీలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.