News April 24, 2025
నేడు విశాఖ రానున్న పవన్ కళ్యాణ్

ఉగ్రవాద దాడిలో మృతి చెందిన చంద్రమౌళికు నివాళులర్పించడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు విశాఖ రానున్నారు. తిరుపతి నుంచి విశాఖ ఎయిర్ పోర్ట్‌కు సాయంత్రం 6.15కి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన పాండురంగపురం వెళ్లి చంద్రమౌళికి నివాళి అర్పిస్తారు. రాత్రికి విశాఖలోనే బస చేసి, శుక్రవారం ఉదయం 9.15 గంటలకు విమానంలో రాజమండ్రికి బయలుదేరుతారు.
Similar News
News April 24, 2025
జ్ఞానాపురం చర్చి మైదానంలో బాలిక మృతదేహం

విశాఖలోని జ్ఞానాపురం చర్చి మైదానంలో అనుమానస్పద స్థితిలో పడి ఉన్న 11 ఏళ్ల బాలిక మృతదేహాన్ని చర్చి ప్రతినిధులు గుర్తించారు. సమాచారం అందుకున్న కంచరపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. బాలిక మృతి పట్ల స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలిలోనే బాలిక తల్లి, అమ్మమ్మ ఉన్నారు.
News April 24, 2025
చంద్రమౌళి కుటుంబ సభ్యులను పరామర్శించిన పవన్ కళ్యాణ్

కశ్మీర్ ఉగ్రవాదుల దాడిలో మరణించిన చంద్రమౌళి కుటుంబ సభ్యులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురువారం పరామర్శించారు. చంద్రమౌళి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉగ్ర దాడుల్లో సామాన్య ప్రజలు మరణించడం తన మనసును కలిచివేసిందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆ కుటుంబాని పవన్ హామీ ఇచ్చారు.
News April 24, 2025
చంద్రమౌళి పార్థివదేహానికి నివాళి అర్పించిన పవన్ కళ్యాణ్

కశ్మీర్ ఉగ్రవాదుల దాడిలో మరణించిన విశాఖ వాసి చంద్రమౌళికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళి అర్పించారు. విశాఖలోని కనకదుర్గ హాస్పిటల్‌కి వెళ్లి చంద్రమౌళి పార్థివ దేహాంపై పూలదండ వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉగ్రవాదుల దాడుల్లో చంద్రమౌళి ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ప్రపంచం మొత్తం ఈ దాడులను ఖండిస్తోందని పేర్కొన్నారు.