News March 28, 2024
నక్కపల్లి: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

నక్కపల్లి మండలం గుల్లిపాడు, నర్సీపట్నం రోడ్డు రైల్వేస్టేషన్ల మధ్య మృతదేహం లభ్యమయ్యింది. విశాఖ నుంచి రాజమండ్రి వెళ్తున్న రైలులో ప్రయాణిస్తున్న వ్యక్తి గురువారం ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందినట్లు తుని రైల్వే ఎస్సై షేక్ అబ్దుల్ మరూఫ్ తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 45 సంవత్సరాలుంటాయని, అతని వివరాలు తెలియలేదన్నారు. తుని ఆస్పత్రిలోని మార్చురీలో మృతదేహాన్ని భద్రపరిచామని చెప్పారు.
Similar News
News March 22, 2026
విశాఖ: ప్రభుత్వ కార్యాలయాల్లో రేపు పీజీఆర్ఎస్

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహిస్తున్నట్లు కమిషనర్ కేతన్ గర్గ్ తెలిపారు. ఉదయం 11 నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీలోని అన్ని జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News March 22, 2026
విశాఖ: ఆక్టోపస్ టీం మాక్ డ్రిల్

నగరంలో శనివారం రాత్రి 11 గంటల నుంచి ఆదివారం వేకువజాము వరకు కైలాసగిరి, సత్యం కూడలిలో గల విప్రో కంపెనీ వద్ద ఆక్టోపస్ టీం విశాఖ నగర సిటీ పోలీస్ బాంబు స్క్వాడ్‌తో కలిసి మాక్ డ్రిల్ నిర్వహించింది. అకస్మాత్తుగా ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినట్లయితే దాని నుంచి వీఐపీలను ఎలా కాపాడాలి, ఎలా బయటపడాలి అనే కోణంలో ఈ మాక్ డ్రిల్ నిర్వహించినట్లు వారు తెలిపారు.
News March 22, 2026
విశాఖ: మహిళ ఆత్మహత్యాయత్నం

ఆరిలోవలోని గృహిణి ఆత్మహత్యకు ప్రయత్నించడంతో బంధువులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. ఆరిలోవ సీఐ మల్లేశ్వరరావు వివరాల ప్రకారం.. శ్వేత అనే మహిళ భర్తతో విభేదాల కారణంగా పాతగరువులో ఉంటున్నారు. శనివారం రాత్రి ఆడపడుచు ఉంటున్న ఎస్సైజీనగర్ ఇంటికి శ్వేత వెళ్లగా వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో శ్వేత వెంటనే అదే ఇంట్లో ఓ గదిలోకి వెళ్లి ఉరివేసుకోగా తలుపులు పగలగొట్టి ఆసుపత్రికి తరలించారు.


