News April 24, 2025
టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్

AP: మే నెలలో జరిగే పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల <
✒ 19- ఫస్ట్ లాంగ్వేజ్& పేపర్-1(కాంపోజిట్ కోర్సు)
✒ 20- సెకండ్ లాంగ్వేజ్ ✒ 21- ఇంగ్లిష్ ✒ 22- గణితం
✒ 23- ఫిజిక్స్ ✒ 24- బయోలజీ ✒ 26- సాంఘిక శాస్త్రం
✒ 27- ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2(కాంపోజిట్ కోర్సు)&OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2
✒ 28-OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2
* పరీక్షలన్నీ ఉదయం 9.30 గంటలకు ప్రారంభం
Similar News
News April 25, 2025
BREAKING: RCB సూపర్ విక్టరీ

ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆర్సీబీ ఎట్టకేలకు హోంగ్రౌండు(చిన్నస్వామి)లో గెలుపు బోణీ కొట్టింది. 206 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన రాజస్థాన్‌ను 194/9 స్కోరుకు కట్టడి చేసి 11 రన్స్ తేడాతో విజయం సాధించింది. జైస్వాల్ 49, సూర్యవంశీ 16, నితీశ్ 28, పరాగ్ 22, జురెల్ 47, హెట్మైర్ 11, శుభమ్ 12 పరుగులు చేశారు. RCB బౌలర్లలో హాజిల్‌వుడ్ 4, కృనాల్ 2, భువనేశ్వర్, యశ్ దయాల్ చెరో వికెట్ తీశారు.
News April 25, 2025
సింధు జలాల ఒప్పందం రద్దు.. పాక్‌కు తేల్చిచెప్పిన భారత్

పహల్గామ్ ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో పాకిస్థాన్‌తో సింధు జలాల ఒప్పందం రద్దు చేసుకుంటున్నట్లు భారత్ ప్రకటించింది. తక్షణమే జల ఒప్పందం రద్దు అమల్లోకి వస్తుందని తెలియజేస్తూ జలవనరుల కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ పాక్‌కు లేఖ రాశారు. ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ సరిహద్దు ఉగ్రవాదాన్ని పాక్ ప్రోత్సహించడమే కారణమని పేర్కొన్నారు. అగ్రిమెంట్‌లో భాగంగా సంప్రదింపులకు విజ్ఞప్తిని పలుమార్లు పాక్ తిరస్కరించిందని గుర్తు చేశారు.
News April 25, 2025
భయపడుతున్న పాకిస్థాన్?

పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ తర్వాత భారత్ ఏ క్షణమైనా తమపై విరుచుకుపడొచ్చని పాకిస్థాన్ భయపడుతున్నట్టు తెలుస్తోంది. భారత పౌర విమానాలు, మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్‌లు తమ గగనతలంలోకి రాకుండా నిషేధించింది. లష్కర్-ఎ-తోయిబా ప్రధాన కార్యాలయంపై ఇండియా ఎయిర్ స్ట్రైక్ చేయొచ్చని పాక్ అంచనా వేస్తోంది. దీంతో పాకిస్థాన్ ఎయిర్‌ఫోర్స్ ‘PAF హెర్క్యులస్’ ద్వారా పెద్దఎత్తున తరలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం.