News April 24, 2025

రేపు జగిత్యాల జిల్లా సమగ్ర స్వరూపం గ్రంథ ఆవిష్కరణ

image

జగిత్యాల జిల్లా సమగ్ర స్వరూపం గ్రంథావిష్కరణ కార్యక్రమాన్ని శుక్రవారం ఉదయం జగిత్యాల మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ కల్వకుంట్ల రామకృష్ణ తెలిపారు. తెలంగాణ సారస్వత పరిషత్ హైదరాబాద్ ప్రచురించిన ఈ గ్రంథాన్ని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆవిష్కరిస్తారన్నారు. సారస్వత పరిషత్ అధ్యక్షుడు శివారెడ్డి, డీఈవో రాము తదితరులు పాల్గొంటారని, జిల్లా రచయితలు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.

Similar News

News April 19, 2026

విశాఖ – భవానీపట్న రైలు రీషెడ్యూల్

image

ఇన్‌కమింగ్ రేక్ ఆలస్యం కావడంతో విశాఖ – భవానీపట్న ప్యాసింజర్ (58504) రైలు సమయాన్ని మార్చినట్లు సీనియర్ డీసీఎం కె.పవన్ కుమార్ తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఆదివారం సాయంత్రం 6 గంటలకు బయలుదేరాల్సిన ఈ రైలు రాత్రి 7 గంటలకు విశాఖ నుంచి బయలుదేరుతుంది. ప్రయాణికులు ఈ మార్పును గమనించి సహకరించాలని రైల్వే అధికారులు కోరారు.

News April 19, 2026

బాపట్ల: యువకుడిపై కత్తితో దాడి..!

image

బాపట్ల చెరువు జమ్ములపాలెంలో ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఘర్షణ దాడికి దారితీసింది. స్థానికుల వివరాల మేరకు.. సురేష్, బ్రహ్మవాసు మద్యం తాగారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య ఓ మహిళ విషయంలో ఘర్షణ చోటు చేసుకుంది. తప్పు చేశావని వాసు ప్రశ్నించడంతో సురేష్ కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని ఏరియా ఆస్పత్రికి తరలించారు. వాసు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News April 19, 2026

భవననిర్మాణ కార్మికుల పేర్లు నమోదు చేసుకోవాలి: GNT కలెక్టర్

image

భవన నిర్మాణ కార్మికులు తమ పేర్లను కార్మికశాఖ కార్యాలయంలో నమోదు చేసుకోవాలని కలెక్టర్ సాయికాంత్ వర్మ సూచించారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు పునః ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. వివాహ కానుక, ప్రసూతి సహాయంగా రూ.20 వేలు, సహజ మరణానికి రూ.60 వేలు, అంత్య క్రియలకు రూ.20 వేలు అందించే సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతోందన్నారు.