News April 24, 2025

KMR: భూ భారతి చట్టంపై అవగాహన సదస్సులు: కలెక్టర్

image

భూ భారతి చట్టంపై సమగ్ర అవగాహన కల్పించేందుకు జిల్లా యంత్రాంగం విస్తృత చర్యలు చేపట్టింది. ఈ మేరకు KMR జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలో అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. గురువారం బీర్కూర్, నసురుల్లాబాద్‌లో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. భూమికి సంబంధించిన కొత్త చట్టంపై ప్రజల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేయడమే ఈ సదస్సుల ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు.

Similar News

News April 25, 2025

కలెక్షన్ల సంభవం.. 2 వారాల్లో రూ.172 కోట్లు!

image

హీరో అజిత్ నటించిన మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ థియేటర్లలో కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. తమిళనాడులో విడుదలైన రెండు వారాల్లోనే రూ.172.3 కోట్లు వసూలు చేసినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతగా వ్యవహరించింది.

News April 25, 2025

MDM: ‘1973 మందికి కారుణ్య నియామకాలు’

image

మందమర్రి ఏరియా జీఎం కార్యాలయంలో మెడికల్ ఇన్వాల్యుయేషన్ డిపెండెంట్ ఒకరికి జీఎం దేవేందర్ కారుణ్య నియామకపత్రం అందజేశారు. మందమర్రి ఏరియాలో ఇప్పటివరకు 1973 మందికి కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు ఇచ్చినట్లు జీఎం పేర్కొన్నారు. ఇతర పరిశ్రమలతో పోలిస్తే సింగరేణిలో పని స్థలాలు, సమయాలు భిన్నంగా ఉంటాయన్నారు. విధులకు గైర్హాజరయితే ఉద్యోగ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందన్నారు.

News April 25, 2025

ఎనుమాముల మార్కెట్ వ్యాపారులు, రైతులకు ముఖ్య గమనిక

image

వరంగల్ ఎనుమాముల మార్కెట్ వ్యాపారులకు, రైతులకు అధికారులకు కీలక సూచనలు చేశారు. ఈ వేసవికాలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున సరుకుల బీటు సమయాల్లో మార్పులు చేసినట్లు తెలిపారు. మిర్చి బీటు ఉ.7.05 ని.కు, పత్తి బీటు 8:05 ని.కు, పల్లికాయ ఉ.8:15 ని.కు, పసుపు బీటు 8:30కి, అపరాలు, ధాన్యం బీటు 8:45 ని.కు జరుగుతాయని పేర్కొన్నారు. ఈనెల 28 సోమవారం నుంచి 11-06-2025 బుధవారం వరకు ఈ బీటులో మార్పులుంటాయన్నారు.

error: Content is protected !!