News April 24, 2025
గుంటూరు మిర్చి యార్డ్‌లో నేటి ధరలు

గుంటూరు మిర్చి మార్కెట్ యార్డుకు గురువారం 90,000 బస్తాలు చేరుకున్నాయి. ఈ మిర్చి ధరలు నాణ్యతను బట్టి భిన్నంగా ఉన్నాయి. 334 రకాల్లో సూపర్ 10 రేట్లు ఇలా ఉన్నాయి. దేశవాళీ రూ.6,000-10,000, డీలక్స్ రూ.10,000-11,000, మద్రాస్ క్వాలిటీ రూ.11,000 పైన ఉన్నాయి. తేజ రకం రెండో కోత (కందుకూరు, పొదిలి) రూ.12,500-రూ.13,000 వరకు పలికింది. 341 రకాలు రూ.7,500-12,000, నంబర్ ఫైవ్ రూ.7,500-రూ.11,000 వరకు ధరలు ఉన్నాయి.
Similar News
News April 25, 2025
GNT: జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన కమిషనర్

గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన బి.సాయి కల్యాణ్ చక్రవర్తిని గురువారం గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కోర్టు ఆవరణలోని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కార్యాలయానికి వెళ్లి కమిషనర్ మొక్కను బహుకరించారు. నగరపాలక సంస్థ పరిధిలోని అభివృద్ధి పనుల్లో భాగంగా స్థలసేకరణలో ఇళ్లు కోల్పోయి కోర్టులో దాఖలైన కేసులపై ఈ సందర్భంగా వారు చర్చించారు.
News April 25, 2025
GNT: ‘పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి’

గుంటూరు జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ అధికారి డా.విజయలక్ష్మి అధ్యక్షతన DMHO చాంబర్‌లో జిల్లా ఆరోగ్య అధికారులతో సమన్వయ సమావేశం గురువారం నిర్వహించారు. డా.విజయలక్ష్మి మాట్లాడుతూ..మలేరియా నియంత్రణలో భాగంగా ప్రతి ఒక్కరూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీటి నిల్వలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 25న జరగబోయే ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటించాలన్నారు.
News April 24, 2025
తెనాలి: బాలికపై లైంగిక దాడి.. కేసు నమోదు

తెనాలిలో ఏడవ తరగతి చదువుతున్న బాలికపై NTR (D) మైలవరానికి చెందిన అవినాశ్ లైంగిక దాడికి పాల్పడగా వన్ టౌన్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఓ ప్రైవేటు స్కూల్లో 7వ తరగతి చదువుతున్న బాలికకు అవినాశ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయ్యాడు. ఇటీవల తెనాలి వచ్చిన అతడు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక ప్రవర్తనలో మార్పు గమనించిన తల్లిదండ్రులు విచారించగా వెలుగులోకి రావడంతో ఫిర్యాదు చేశారు.