News March 28, 2024
ఎన్టీఆర్: ప్రయాణికులకు శుభవార్త
ప్రయాణికుల రద్దీ మేరకు సికింద్రాబాద్ (SC), దిబ్రుగఢ్ (DBRG) మధ్య విజయవాడ మీదుగా నడిచే స్పెషల్ ఫేర్ రైళ్లను పొడిగించామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నెం.07046 SC- DBRG మధ్య నడిచే రైలును ఏప్రిల్ 1 నుంచి మే 13 వరకు ప్రతి సోమవారం, నం. 07047 DBRG- SC మధ్య నడిచే రైలును ఏప్రిల్ 4 నుంచి మే 16 వరకు ప్రతి గురువారం నడుపుతామన్నారు. ఈ రైళ్లు విజయవాడతో పాటు విశాఖపట్నం తదితర స్టేషన్లలో ఆగుతాయన్నారు.
Similar News
News November 5, 2024
విజయవాడ: కాదంబరి జెత్వానీ కేసులో కీలక అప్డేట్
ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో ప్రధాన నిందితుడు కుక్కల విద్యాసాగర్‌ను కస్టడీకి ఇవ్వాలని సీఐడీ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను న్యాయస్థానం ఈనెల 7కి వాయిదా వేసింది. విద్యాసాగర్‌ను వారం పాటు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని మూడో అదనపు చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు విద్యాసాగర్ తరఫు న్యాయవాదిని ఆదేశించింది.
News November 5, 2024
విజయవాడ: పదో తరగతి పరీక్ష ఫీజు గడువు పెంపు
పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులు చెల్లించాల్సిన ఫీజుల గడువును పాఠశాల విద్యాశాఖ పొడిగించింది. గతంలో ప్రకటించిన గడువు ప్రకారం అపరాధ రుసుము లేకుండా అక్టోబరు 28కి ఫీజులు చెల్లించాల్సి ఉంది. అయితే ఆ గడువును ఈ నెల 18 వరకు పెంచుతూ ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి ఆదేశాలు జారీచేశారు. రూ.50 అపరాధ రుసుముతో ఈ నెల 25 వరకు రూ.200 అపరాధ రుసుముతో చెల్లించవచ్చు అన్నారు.
News November 5, 2024
బాలికపై ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన
కోడూరు మండలంలో కీచక టీచర్ మూడో తరగతి చదువుతున్న బాలికపై అసభ్యంగా ప్రవర్తించడంపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలిక తల్లిదండ్రులు కోరుచున్నారు. బాలికపై జరిగిన ఈ దారుణం పాప తమకు చెప్పడానికే భయపడిందని, అంతలా భయపెట్టాడని వాపోయారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్లో టీచర్‌పై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. గత ఐదు నెలల్లో కోడూరు మండలంలో ఇలాంటి ఘటనలు నాలుగు చోటు చేసుకోవడం, ముగ్గురు ఉపాధ్యాయులు సస్పెండ్ కావడం గమనార్హం.