News April 24, 2025

పాకిస్థానీల వీసాలన్నీ రద్దు

image

ఇప్పటివరకు పాకిస్థాన్ ప్రజలకు ఇచ్చిన వీసాలన్నింటినీ భారత విదేశాంగ శాఖ రద్దు చేసింది. ప్రస్తుతం దేశంలో ఉన్న పాకిస్థానీల వీసాలు ఈ APR 27 వరకు మాత్రమే చెల్లుతాయని స్పష్టం చేసింది. ఇక మెడికల్ వీసాలతో భారత్‌లో ఉన్నవారు ఏప్రిల్ 29 లోపు వెళ్లిపోవాలని పేర్కొంది. మరోవైపు భారతీయులెవరూ పాక్‌కు వెళ్లొద్దని చెప్పడంతో పాటు ఇప్పటికే ఆ దేశంలో ఉన్న ఇండియన్స్ వీలైనంత త్వరగా తిరిగి రావాలని సూచించింది.

Similar News

News April 25, 2025

26న కామారెడ్డిలో జాబ్ మేళా

image

ఈ నెల 26న కామారెడ్డి జిల్లా కేంద్రంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి మల్లయ్య తెలిపారు. పలు ప్రైవేట్ కంపెనీల ఆధ్వర్యంలో జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో జాబ్ మేళా కొనసాగుతుందని ఆయన చెప్పారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సర్టిఫికెట్లతో ఉదయం 11 గంటలకు కార్యాలయానికి రావాలని ఆయన సూచించారు.

News April 25, 2025

TODAY HEADLINES

image

* డబ్బులు లేకున్నా హైటెక్ సిటీ నిర్మించా: చంద్రబాబు
* రూపాయికి ఇడ్లీ అయినా వస్తుందా?: జగన్
* ఏపీ టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్
* ఉగ్రవాదులు కలలో కూడా ఊహించని విధంగా శిక్షిస్తాం: మోదీ
* ఉగ్రదాడి ఘటనపై ముగిసిన అఖిలపక్ష భేటీ
* కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకున్నా మద్దతిస్తాం: రాహుల్
* పహల్గామ్ ఘటనను దేశం ఎప్పటికీ మరిచిపోదు: పవన్
* IPLలో RRపై RCB థ్రిల్లింగ్ విక్టరీ

News April 25, 2025

BREAKING: RCB సూపర్ విక్టరీ

image

ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆర్సీబీ ఎట్టకేలకు హోంగ్రౌండు(చిన్నస్వామి)లో గెలుపు బోణీ కొట్టింది. 206 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన రాజస్థాన్‌ను 194/9 స్కోరుకు కట్టడి చేసి 11 రన్స్ తేడాతో విజయం సాధించింది. జైస్వాల్ 49, సూర్యవంశీ 16, నితీశ్ 28, పరాగ్ 22, జురెల్ 47, హెట్మైర్ 11, శుభమ్ 12 పరుగులు చేశారు. RCB బౌలర్లలో హాజిల్‌వుడ్ 4, కృనాల్ 2, భువనేశ్వర్, యశ్ దయాల్ చెరో వికెట్ తీశారు.

error: Content is protected !!