News April 24, 2025
అనకాపల్లి: 590 ప్లస్ మార్కులు సాధించిన విద్యార్థులకు అభినందనలు

అనకాపల్లి జిల్లాలో పదో తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన 9 మంది విద్యార్థులను కలెక్టర్ విజయకృష్ణన్ కలెక్టరేట్లో గురువారం అభినందించి మెమెంటోలు అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. 590కి పైగా మార్కులను ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన 9 మంది విద్యార్థులు సాధించడం హర్షించతగ్గ విషయం అన్నారు. అనకాపల్లి జిల్లా రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంకు సాధించిందని పేర్కొన్నారు.
Similar News
News April 20, 2026
సంగారెడ్డి: ఓపెన్ స్కూల్ పరీక్షలు.. 7757 విద్యార్థులు

జిల్లాలో ఈనెల 20 నుంచి 27వ తేదీ వరకు ఓపెన్ 10 ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా సమన్వయకర్త వెంకటస్వామి తెలిపారు. పదో తరగతికి 10 పరీక్ష కేంద్రాల్లో 2,692, ఇంటర్మీడియట్‌కు 18 కేంద్రాల్లో 5,065, మొత్తం 7,757 మంచి విద్యార్థులు పరీక్ష రాస్తున్నారని చెప్పారు. పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.
News April 20, 2026
జనగణన ఉన్నా.. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీ?

TG: ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల నిషేధాన్ని ఎత్తివేయాలని సర్కార్ యోచిస్తున్నట్లు సమాచారం. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ ఫైలుపై CM రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని, త్వరలోనే ఉత్తర్వులు రానున్నట్లు తెలుస్తోంది. జనగణన విధులు ముగిశాకే రిలీవింగ్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారని టాక్. రెండేళ్ల సర్వీస్ పూర్తికాని వారికి ఈసారి ఛాన్స్ లేదు. అలాగే స్పౌజ్ కేటగిరీ, దివ్యాంగులకు టాప్ ప్రయారిటీ ఇవ్వనున్నారు.
News April 20, 2026
జూన్/జులైలో MPTC, ZPTC ఎన్నికలు?

TG: MPTC, ZPTC ఎన్నికలను జూన్ చివరి వారం లేదా జులైలో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందని సమాచారం. గతంలో మే నెలలోనే జరపాలని అనుకున్నప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం జనాభా గణన చేపట్టనుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మే 11 నుంచి జూన్ 9 వరకు జనాభా గణన ప్రక్రియ కొనసాగనుంది. ఈలోగా ఓటర్ల జాబితా సవరణ కూడా పూర్తి చేయాల్సి ఉండటంతో యంత్రాంగం బిజీగా ఉంది.


